కొమురంభీం జిల్లాలో ఓ కానిస్టేబుల్ మిస్సింగ్ కలకలం రేపింది. పెంచికల్‌పేట పీఎస్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న భానేష్.. గత నెల 28 నుంచి కనిపించకుండా పోయాడు. సిర్పూర్ టి చెక్‌పోస్టు దగ్గర చివరిసారిగా విధులను నిర్వహించాడు. ఆ తర్వాత భానేష్ జాడ లేకుండా పోవడంతో.. అతని భార్య స్వప్న ఫిర్యాదు చేసింది.
అయితే తాను క్షేమంగానే ఉన్నానంటూ కానిస్టేబుల్ భానేష్.. స్థానిక ఎస్సైకి సమాచారం అందించాడు. కుటుంబ కలహాలు, ఆర్ధిక ఇబ్బందులతో విధులకు హాజరుకాలేకపోయానని తెలిపాడు. ఈ మేరకు భానేష్ భార్య స్వప్నకు ఆ సమాచారాన్ని చేరవేశారు పోలీసులు. సమాచారాన్ని అందించినప్పటికీ.. భానేస్ ఎక్కడికి వెళ్లాడన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబసభ్యులు కూడా ఆందోళన చెందుతుండడంతో.. అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also Read :
పాక్ దౌత్యాధికారికి భారత్ సమన్లు, సరిహద్దులో కాల్పుల విరమణకు తూట్లు పొడవడంపై ఆగ్రహం
ట్రంప్ మద్దతు దారుల నిరసన, తిరగబడ్డ వ్యతిరేక వర్గాలు, పెప్పర్ స్ప్రేను ఉపయోగించిన పోలీసులు