తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో పార్టీ ప్రక్షాళనపై కాంగ్రెస్ కసరత్తు, సంస్థాగత మార్పులపై దృష్టి, మేల్కొన్నట్టేనా ?

| Edited By: Pardhasaradhi Peri

Dec 20, 2020 | 1:19 PM

తెలంగాణ సహా 4 రాష్ట్రాల్లో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. నిన్న అసమ్మతివాదులతో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్, సమావేశమైన అనంతరం తొలి దశలో..

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో పార్టీ ప్రక్షాళనపై కాంగ్రెస్ కసరత్తు, సంస్థాగత మార్పులపై దృష్టి, మేల్కొన్నట్టేనా ?
Follow us on

తెలంగాణ సహా 4 రాష్ట్రాల్లో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. నిన్న అసమ్మతివాదులతో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్, సమావేశమైన అనంతరం తొలి దశలో భాగంగా ఇందుకు పూనుకొంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర పార్టీ శాఖల ప్రక్షాళన జరగనుంది. హైదరాబాద్ జీ హెచ్ ఎం సి ఎన్నికల్లో పార్టీ దయనీయ స్థితికి తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, గుజరాత్ బైపోల్స్ లో పార్టీ ఓటమికి ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అమిత్ చావ్దా రాజీనామా చేశారు. ఇక మధ్యప్రదేశ్ లో ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్ నాథ్ సీఎల్ఫీనేత కూడా అయినందున ఆయనకు పార్టీని బలోపేతం చేసే బాధ్యతను అప్పగించినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబై రీజనల్ కాంగ్రెస్ కమిటీలో మార్పులు చేశారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు,సి ఎల్ఫీ నేత కూడా అయిన బాలాసాహెబ్ థోరట్ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు.

కాగా అస్సాం, కేరళ రాష్ట్రాలకు ముగ్గురేసి చొప్పున ఏఐసీసీ సెక్రటరీలను పార్టీ అధిష్ఠానం నియంనుంచింది. అస్సాం కు జితేంద్ర సింగ్, కేరళకు తారిఖ్ అన్వర్ ఇన్-చార్జులుగా ఉండగా వారికి..వీరు సహకరిస్తారు.