ఫేజ్ -3 ట్రయల్స్ ఏవీ ? భారత్ బయో టెక్ వ్యాక్సిన్ పై కాంగ్రెస్ నేతల ఆందోళన, అనుమతికి తొందరపడ్డారని వ్యాఖ్య

| Edited By: Anil kumar poka

Jan 03, 2021 | 5:23 PM

భారత్ బయో టెక్ వ్యాక్సిన్ ఫై కాంగ్రెస్ నేతలు శశిథరూర్, ఆనంద్ శర్మ, జైరాం రమేష్ తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఫేజ్ -3 ట్రయల్స్ ఏవీ ? భారత్ బయో టెక్ వ్యాక్సిన్ పై కాంగ్రెస్ నేతల ఆందోళన, అనుమతికి తొందరపడ్డారని వ్యాఖ్య
Follow us on

భారత్ బయో టెక్ వ్యాక్సిన్ ఫై కాంగ్రెస్ నేతలు శశిథరూర్, ఆనంద్ శర్మ, జైరాం రమేష్ తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు.  భారత్ బయో టెక్ సంస్థ డెవలప్ చేసిన కోవాగ్జిన్ కి డ్రగ్ రెగ్యులేటరీ ఆమోదం తెలిపింది. అయితే మూడో దశ ట్రయల్స్ నిర్వహించనిదే ఈ టీకామందును పరిమిత వినియోగానికి అనుమతినివ్వడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దీనికి సంబంధించిన తప్పనిసరి ప్రొటొకాల్స్ ను, డేటా వెరిఫికేషన్ ను ఎలా మంజూరు చేసిందని వీరు ప్రశ్నించారు. ఇండియాలో డ్రగ్ రెగ్యులేటర్ డీసీజీఐ నిన్న ఆక్స్ ఫర్డ్ కరోనా వైరస్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ కి, భారత్ బయో టెక్ వారి కోవాగ్జిన్ కి పరిమిత వినియోగానికి అనుమతినిచ్చిన సంగతి గమనార్హం. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ..హోం వ్యవహారాలపై గల పార్లమెంటరీ పానెల్ చైర్మన్ అయిన ఆనంద్ శర్మ..దీని గురించి సుదీర్ఘంగా ప్రస్తావించారు.

ఈ టీకామందుకు అనుమతినిచ్ఛేముందు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని, ఏ దేశం కూడా మాండేటరీ ఫేజ్ 3 ట్రయల్ డేటా వెరిఫికేషన్ లేకుండా అనుమతించలేదని ఆయన అన్నారు. మూడో దశ ట్రయల్స్ ఇంకా పూర్తి కాలేదు, అందువల్ల దీని సేఫ్టీ, నాణ్యతలపై ఇంకా సమీక్ష జరగాల్సి ఉంది.. ఈ కేసులో ఆరోగ్య శాఖ మాండేటరీ ప్రొటొకాల్స్ తో బాటు అనుమతించడానికి గల  కారణాలను వివరించాలని ఆయన కోరారు. ఇది పరిమిత కేటగిరీ కిందఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఇస్తున్నారని, వారి ఆరోగ్యాన్ని, సేఫ్టీని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని ఆనంద్ శర్మ పేర్కొన్నారు.ఇక మరో ఎంపీ శశిథరూర్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ  ట్రయల్స్ పూర్తి అయ్యేవరకు ఈ వ్యాక్సిన్ వినియోగాన్ని నివారించాలన్నారు. ఇలాగే జైరాం రమేష్ కూడా దీనిపై ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వివరణ ఇవ్వాలని ట్వీట్ చేశారు.