హైదరాబాద్ సీపీపై చర్యలు.. గవర్నర్‌ను కోరిన కాంగ్రెస్ నేతలు

| Edited By:

Jan 01, 2020 | 8:04 AM

కాంగ్రెస్ నాయకుల ప్రతినిధి బృందం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంగళవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళైసై సౌందరాజన్‌ను కలిశారు. కాంగ్రెస్ కేడర్‌ను వేధించడానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం పోలీసు బలగాల్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తూ నాయకులు మెమోరాండం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 లోని సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ కు ఉన్న ప్రత్యేక అధికారాల కింద హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్ పై […]

హైదరాబాద్ సీపీపై చర్యలు.. గవర్నర్‌ను కోరిన కాంగ్రెస్ నేతలు
Follow us on

కాంగ్రెస్ నాయకుల ప్రతినిధి బృందం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంగళవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళైసై సౌందరాజన్‌ను కలిశారు. కాంగ్రెస్ కేడర్‌ను వేధించడానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం పోలీసు బలగాల్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తూ నాయకులు మెమోరాండం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 లోని సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ కు ఉన్న ప్రత్యేక అధికారాల కింద హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్ పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

ఈ ప్రతినిధి బృందంలో సీనియర్ నాయకులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మహ్మద్ అలీ షబ్బీర్, వి హనుమంతరావు, డి శ్రీధర్ బాబు, సీతక్క, కుసుమ్ కుమార్ తదితరులు ఉన్నారు. “తెలంగాణ పోలీసులు, ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, సాధారణ ప్రజలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై చట్టవిరుద్ధ పద్ధతులను ప్రయోగిస్తున్నారని వారు పేర్కొన్నారు.

135 వ ఫౌండేషన్ డే (కాంగ్రెస్ పార్టీ నిర్మాణ దినోత్సవం) సందర్భంగా డిసెంబర్ 28 న జరిగిన పరిణామాలను గవర్నర్‌కు తెలియజేసినట్లు ఉత్తమ్ చెప్పారు. . ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఏ మార్గంలో కూడా ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. గాంధీ భవన్‌లో డిసెంబర్ 28 న జెండా ఎగురవేసిన తరువాత.. సిఎఎకు, పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా గాంధీ భవన్ లోపల శాంతియుత సత్యాగ్రహం చేశామని తెలిపారు. “ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ వేడుకల్లో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వస్తున్న కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు” అని ఉత్తమ్ వాపోయారు.