AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కొండా సురేఖ బర్తరఫ్‌..! లేఖను రెడీ చేస్తున్న సీఎంవో..

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం వెలుగు చూసింది. గత కొద్ది రోజులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రు చర్చనీయాంశంగా మారిన మంత్రి కొండా సురేఖ అంశంపై క్లారిటీ వచ్చింది. మంత్రి కొండా సురేఖపై చర్యలకు కాంగ్రెస్ అధిష్టానం సిద్దమైనట్టు తెలుస్తోంది. ఆమె రాజీనామాకు ససేమిరా అనడంతో బర్తరఫ్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమచారాం.

Telangana: కొండా సురేఖ బర్తరఫ్‌..! లేఖను రెడీ చేస్తున్న సీఎంవో..
Congress High Command Decision On Konda Surekha
Anand T
|

Updated on: Sep 03, 2026 | 2:54 PM

Share

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై స్పష్టత వచ్చింది. మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆమె తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి ససేమిరా అనడంతో, ఆమెను నేరుగా బర్తరఫ్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఢిల్లీ అధిష్టానం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO) ఆదేశాలు అందాయి. దీంతో వెంటనే సీఎంవో చర్యలకు సిద్ధమైంది. వెంటనే అధికారిక లేఖను గవర్నర్‌కు పంపింది. కాసేపట్లో లోక్‌భవన్‌ నుంచి ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా కొండా సురేఖ వ్యవహారంతో పాటు తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా ఉన్న చిన్నారెడ్డిపై కూడా చర్యలు తీసుకున్నారు. ప్లానింగ్ బోర్డు బాధ్యతల నుంచి చిన్నారెడ్డిని తొలగించి, ఆయన స్థానంలో గద్వాల విజయలక్ష్మికి చోటు కల్పించారు. అలాగే గద్వాల విజయలక్ష్మి స్థానంలో నేరెళ్ల శారదను మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించారు. కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us