AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంజినీరింగ్‌ పూర్తి చేశారా? రూ.1.12 లక్షల జీతంతో SSC JE ఉద్యోగ నోటిఫికేషన్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఇక్కడ చెక్ చేసుకోండి..

ఇంజినీరింగ్‌ పూర్తి చేశారా? రూ.1.12 లక్షల జీతంతో  SSC  JE ఉద్యోగ నోటిఫికేషన్
SSC Junior Engineer Recruitment
Srilakshmi C
|

Updated on: Sep 04, 2026 | 5:03 PM

Share

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భారీ శుభవార్త అందించింది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్‌లు, ఇండియా మెటీరియోలాజికల్ డిపార్ట్‌మెంట్ (IMD)లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,748 పోస్టులను భర్తీ చేయనుంది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, టెలికాం తదితర ఇంజినీరింగ్ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. అర్హత ఉన్న కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, టెలికాం, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ తదితర ఇంజినీరింగ్ విభాగాల్లో డిగ్రీ కలిగిన చెందిన అభ్యర్థులు పోస్టులను బట్టి దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పని అనుభవం కూడా తప్పనిసరిగా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి ఆగస్టు 1, 2026వ తేదీ నాటికి 30 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలకు వయో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 నుంచి 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్ 22, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.100 చొప్పున చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది. అభ్యర్థుల ఎంపికను కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతంగా చెల్లిస్తారు.

SSC జూనియర్ ఇంజినీర్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాత పరీక్ష విధానం

రాత పరీక్ష మొత్తం రెండు పేపర్లకు ఉంటుంది. పేపర్ Iలో మొత్తం 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 మార్కులు, అభ్యర్థి ఎంచుకున్న ఇంజినీరింగ్ సబ్జెక్టు నుంచి 100 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు. పేపర్ 2 పరీక్షలో అభ్యర్థి ఎంచుకున్న సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్ సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షకు 300 మార్కులు, సమయం 2 గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 22, 2026 రాత్రి 11 గంటల వరకు
  • ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: సెప్టెంబరు 23, 2026 రాత్రి 11 గంటల వరకు
  • దరఖాస్తు సవరణ గడువు: సెప్టెంబరు 28 నుంచి 30 వరకు
  • పేపర్ 1 పరీక్ష: అక్టోబర్/నవంబర్‌లో 2026
  • పేపర్ 2 పరీక్ష: డిసెంబరులో 2026

SSC జూనియర్ ఇంజినీర్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us