బీజేపీలో చేరిన మాజీ కాంగ్రెస్ నేత, యూత్ కాంగ్రెస్ ఎన్నికల విజేత, మాతృ పార్టీ నుంచి గ్రీటింగ్స్ వెల్లువ !

| Edited By: Anil kumar poka

Dec 23, 2020 | 11:55 AM

మధ్యప్రదేశ్ లో జరిగిన యువ జన కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ఎపిసోడ్ లో ఇదో  తమాషా తకరారు వ్యవహారం ! ఎప్పుడో గత మార్చి నెలలోనే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన హర్ జిత్ సింఘాయ్ అనే యువ నేత ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నాడనుకుని...

బీజేపీలో చేరిన మాజీ కాంగ్రెస్ నేత,  యూత్ కాంగ్రెస్ ఎన్నికల విజేత, మాతృ పార్టీ నుంచి గ్రీటింగ్స్ వెల్లువ !
BJP vs Congress
Follow us on

మధ్యప్రదేశ్ లో జరిగిన యువ జన కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ఎపిసోడ్ లో ఇదో  తమాషా తకరారు వ్యవహారం ! ఎప్పుడో గత మార్చి నెలలోనే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన హర్ జిత్ సింఘాయ్ అనే యువ నేత ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నాడనుకుని భావించిన కాంగ్రెస్ నేతలు ఆయనకు శుభాకాంక్షలు చెప్పడం విశేషం,. కారణం… ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఈయన 12 ఓట్ల తేడాతో గెలిచాడు. లోగడ మార్చి నెలలో జ్యోతిరాదిత్య సింధియా తో బాటు అనేకమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు బీజేపీలో చేరగా వారిలో ఈ సింఘాయ్ కూడా ఉన్నారు. కానీ ఈయన ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారనుకుని ఈ పార్టీ భావించింది. ఈ ఎన్నికల్లో గెలిచినందుకు తనను ఈ పార్టీవాళ్లంతా గ్రీట్ చేస్తున్నారని, ఇదో జోక్ లా ఉందని ఈయన అంటున్నాడు. యువజన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మూడేళ్ళ క్రితమే తాను పార్టీ సంస్థాగత ఎన్నికల్లో పోటీ చేయదలిచి నామినేషన్ వేశానని, కానీ ఎన్నికలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చాయని సింఘాయ్ తెలిపారు. బీజేపీలో చేరిన అనంతరం నా పేరును కాంగ్రెస్ నుంచి తొలగించాలని కోరాను.. కానీ అలా జరగలేదు.. అన్నారాయన,

కాంగ్రెస్ పార్టీ తన యువజన విభాగాలతో ఎంతగా టచ్ లో ఉంటోందో ఈ ఉదంతం తెలియజేస్తోంది. ఈ యవ్వారాన్ని బీజేపీ హేళన చేస్తుండగా..ఈ పొరబాటుకు ఎవరు కారణమనే దానిపై ఆరా తీసేందుకు కాంగ్రెస్ క్రమ శిక్షణ కమిటీని ఏర్పాటు చేసింది.