రాజ్యసభకు మన్మోహన్… ఈ సారి రాజస్థాన్‌ నుంచి?

| Edited By:

Jul 02, 2019 | 9:59 PM

మాజీ ప్రధాని ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మన్మోహన్ సింగ్‌ను రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన డీఎంకే నేత స్టాలిన్ ఓప్పుకోకపోవడంతో ఆయన్ను రాజస్థాన్ నుండి ఎంపిక చేయించేందుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పావులు కదుపుతుంది. కాగా తమిళనాడులోని ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు మదన్ లాల్ షైనీ మరణంతో ఈ సీటుకు ఖాళీ ఏర్పడింది. గత ఏడాది బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు షైనీ ఎన్నికయ్యారు. అయితే ప్రస్తుతం రాజస్థాన్ […]

రాజ్యసభకు మన్మోహన్... ఈ సారి రాజస్థాన్‌ నుంచి?
Follow us on

మాజీ ప్రధాని ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మన్మోహన్ సింగ్‌ను రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన డీఎంకే నేత స్టాలిన్ ఓప్పుకోకపోవడంతో ఆయన్ను రాజస్థాన్ నుండి ఎంపిక చేయించేందుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పావులు కదుపుతుంది. కాగా తమిళనాడులోని ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు మదన్ లాల్ షైనీ మరణంతో ఈ సీటుకు ఖాళీ ఏర్పడింది. గత ఏడాది బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు షైనీ ఎన్నికయ్యారు. అయితే ప్రస్తుతం రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది.

కాగా, రాజస్థాన్ నుంచి రాజ్యసభకు మన్మోహన్‌ అభ్యర్థిత్వం దాదాపు ఖాయమైనప్పటికీ ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. మన్మోహన్‌ను రాజ్యసభకు పంపడం గురించి చర్చ జరుగుతున్నట్టు రాజస్థాన్ మంత్రి ఒకరు ధ్రువీకరించారు. కాగా, కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలనే నిర్ణయాన్ని పునరాలోచించాలని‌ రాహుల్ గాంధీని సోమవారంనాడు కోరిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆ తర్వాత మన్మోహన్‌ను ఆయన నివాసంలో కలుసుకోవడం కూడా సింగ్ అభ్యర్థిత్వం వార్తలకు బలం చేకూరుస్తోంది.