
New strain : ఏపీలో యూకే నుంచి వచ్చిన వారికోసం వేట కొనసాగుతోంది. నవంబర్ చివరి వారం నుంచి ఇప్పటివరకు ఎంత మంది వచ్చారు? ఎక్కడెక్కడకు వెళ్లారన్నదానిపై వేట కొనసాగుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో బ్రిటన్ నుంచి వచ్చిన వారిని గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 33మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఓ మహిళకు పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ఆమె నివాసం ఉంటున్న ఇంటి చుట్టుపక్కల కంటైన్మెంట్ జోన్‌ను ఏర్పాటు చేశారు. వీరఘట్టం బీసీ కాలనీని కంటైన్మెంట్ జోన్‌గా ఏర్పాటు చేశారు.
మరోవైపు గుంటూరు జిల్లాలోనూ బ్రిటన్ నుంచి తిరిగి వచ్చిన వారిపై ఆందోళన నెలకొంది. సత్తెనపల్లిలో బ్రిటన్ నుంచి నలుగురు వచ్చారు. వీరికి వైద్య అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే అందరికీ నెగెటివ్ వచ్చినా.. క్వారంటైన్లో ఉంచారు. వీరుంటున్న ఇళ్లకు సమీపంలో మొత్తం 40మందికి పరీక్షలు చేశారు. ఎవ్వరికీ కరోనా నిర్థారణ కాలేదు. అయితే స్థానికంగా ఆందోళణ మాత్రం నెలకొంది. బ్రిటన్ స్ట్రెయిన్ ఏమైనా వచ్చిఉంటుందనే అపోహలో ఉన్నట్లు తెలుస్తోంది.