ఇదో కొత్త త‌ర‌హా మోసం, ‘షాదీ ముబారక్‌’ సొమ్ము కాజేశారు !

|

Aug 22, 2020 | 5:17 PM

టెక్నాలజీ కొత్త పుంత‌లు తొక్కుతోంది. మంచి విష‌య‌మే. కానీ అంత‌కంటే ఎక్కువ‌గా అది త‌ప్పుడు ప‌నుల కోసం వినియోగించ‌బ‌డుతుంది. మ‌న‌కు తెలియ‌కుండానే మ‌న బ్యాంక్‌లోని క్యాష్ మాయ‌మ‌వుతుంది.

ఇదో కొత్త త‌ర‌హా మోసం, ‘షాదీ ముబారక్‌’ సొమ్ము కాజేశారు !
Follow us on

టెక్నాలజీ కొత్త పుంత‌లు తొక్కుతోంది. మంచి విష‌య‌మే. కానీ అంత‌కంటే ఎక్కువ‌గా అది త‌ప్పుడు ప‌నుల కోసం వినియోగించ‌బ‌డుతుంది. మ‌న‌కు తెలియ‌కుండానే మ‌న బ్యాంక్‌లోని క్యాష్ మాయ‌మ‌వుతుంది. మ‌నకిచ్చిన చెక్ ఎక్క‌డో ముందుగానే డ‌బ్బు డ్రా అవుతుంది. తాజాగా సీటీకి చెందిన ఓ లబ్ధిదారుడికి ఇచ్చిన షాదీ ముబారక్‌ స్కీమ్‌ చెక్కు చెల్లకుండాపోయింది. ఇది జారీ కావడానికి ముందే తమిళనాడులో ఎన్‌క్యాష్ అవ్వ‌డం గ‌మ‌నార్హం. ఈ మేరకు బాధితుడు శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల‌ను అప్రోచ్ అయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ మొద‌లుపెట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. చాంద్రాయణగుట్టకు చెందిన బాధితుడు ఈ సంవత్స‌రం జనవరిలో తన కుమార్తెకు పెళ్లి చేశాడు. పేద కుటుంబం కావడంతో షాదీ ముబారక్‌ పథకానికి అప్లై చేసుకున్నాడు. డ‌బ్బు మంజూరు కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 22న బండ్లగూడ రెవెన్యూ అధికారులు స‌ద‌రు చెక్ తీసుకెళ్లి ఇచ్చాడు. దీన్ని బాధితుడు బ్యాంకులో డిపాజిట్‌ చేసినా ఎన్‌క్యాష్ అవ్వ‌లేదు. అసుల ఏం జ‌రిగిందో తెలుసుకోగా, ఈ జనవరిలోనే చెక్కు చెన్నైలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఎన్‌క్యాష్‌ అయినట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న బాధితుడు శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

 

Also Read :

ఏపీ : బదిలీలు, నియామకాల విధానం రివ్యూకు కమిటీ

పొలంలో విత్తనాలు చ‌ల్లి వినాయ‌కుడి రూపం, భ‌లే ఉంది క‌దా !