తమిళ కమెడియన్ వడివేల్ బాలాజీ గుండెపోటుతో మృతి

|

Sep 10, 2020 | 3:56 PM

తమిళ హాస్యనటుడు వడివేల్ బాలాజీ(45) మృతి చెందారు. గురువారం ఉదయం చెన్నైలోని గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.

తమిళ కమెడియన్ వడివేల్ బాలాజీ గుండెపోటుతో మృతి
Follow us on

మరో సినీ తార నింగికెగిసింది. నిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయప్రకాష్ రెడ్డి దుర్మరణం పాలవ్వగా, తాజా మరో తమిళ కమెడియన్ అనారోగ్యంతోనే ప్రాణాలు విడిచారు. తమిళ హాస్యనటుడు వడివేల్ బాలాజీ(45) మృతి చెందారు. గురువారం ఉదయం చెన్నైలోని గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. కొద్దిరోజుల క్రితం వడివేల్ బాలాజీకి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆయనను.. చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. గత 15 రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయనకు చికిత్స పొందుతూ మరణించినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

కాగా, అనారోగ్యానికి గురైన బాలాజీని మొదట కుటుంబసభ్యలు చిన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేర్పించారు. ప్రైవేట్ ఆసుపత్రి ఖర్చులు భరించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో గురువారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పలు తమిళ చిత్రాల్లో వడివేల్ బాలాజీ నటించారు. విజయ్ టీవీలో ప్రసారమయ్యే ఓ కామెడీ షో ద్వారా బాలాజీ పాపులర్ అయ్యారు. తమిళంలో ప్రముఖ కమెడియన్ అయిన వడివేలును బాలాజీ అనుకరించేవాడు. దీంతో.. ఆయనకు వడివేలు బాలాజీగా పేరొచ్చింది. బాలాజీ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు.