ప్రపంచంలో అత్యంత చల్లని ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసా.? అక్కడ కనిష్ట ఉష్ణోగ్రత ఎంతో తెలిస్తో వణికిపోవాల్సిందే.

|

Dec 19, 2020 | 9:34 PM

మన ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైతేనే చలికి వణికిపోతాం. అలాంటిది ఏకంగా -71 సీసీకి చేరితే పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. ఏంటీ... ఊహకు కూడా అందట్లేదు కదా. అయితే అలాంటి ఓ ప్రదేశం భూమిపై నిజంగానే ఉంది.

ప్రపంచంలో అత్యంత చల్లని ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసా.? అక్కడ కనిష్ట ఉష్ణోగ్రత ఎంతో తెలిస్తో వణికిపోవాల్సిందే.
Follow us on

coldest villege in world: మన ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైతేనే చలికి వణికిపోతాం. అలాంటిది ఏకంగా -71 సీసీకి చేరితే పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. ఏంటీ… ఊహకు కూడా అందట్లేదు కదా. అయితే అలాంటి ఓ ప్రదేశం భూమిపై నిజంగానే ఉంది. అదే రష్యా సైబీరియాకు చెందిన ఒమ్యకోన్ అనే గ్రామం. అంటార్కిటికా వెలుపల ఉన్న ఈ గ్రామం ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రదేశంగా పేరు గాంచింది.


ఇక్కడ సగటు ఉష్ణోగ్రత -50 డిగ్రీలుగా నమోదవవుతుంది. ఇక 1924 సంవత్సరంలో అయితే అత్యల్పంగా -71.2 డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రత నమోదైంది. ఈ గ్రామంలో 900 మంది నివసిస్తున్నారు. ఇక్కడ డిసెంబర్ నెలలో సూర్యుడు 10 గంటలకు ఉదయిస్తాడు. శీతాకాలంలో ఈ గ్రామంలో పంటలు పండించరు. ప్రజలు ఎక్కువగా మాంసాన్ని ఆహారంగా తీసుకుంటూ జీవనం సాగిస్తుంటారు.