డీఆర్సీ మీటింగ్‌లో వాగ్వాదంపై సీరియస్.. ఎంపీ పిల్లి సుభాష్, ఎమ్మెల్యే ద్వారంపూడిను క్యాంపు ఆఫీస్‌కు పిలిపించిన సీఎం

కాకినాడలో జరిగిన తూర్పుగోదావరి జిల్లా డీఆర్సీ సమావేశంలో వైసీపీ సీనియర్ నేతల వాగ్వాదంపై సీఎం వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. వివాదానికి కారణమైన

డీఆర్సీ మీటింగ్‌లో వాగ్వాదంపై సీరియస్.. ఎంపీ పిల్లి సుభాష్, ఎమ్మెల్యే ద్వారంపూడిను క్యాంపు ఆఫీస్‌కు  పిలిపించిన సీఎం
Follow us
Venkata Narayana

|

Updated on: Nov 25, 2020 | 4:33 PM

కాకినాడలో జరిగిన తూర్పుగోదావరి జిల్లా డీఆర్సీ సమావేశంలో వైసీపీ సీనియర్ నేతల వాగ్వాదంపై సీఎం వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. వివాదానికి కారణమైన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. తనను కలవాలంటూ ఇరువురు నేతలకు సీఎం జగన్ వర్తమానం పంపారు. దీంతో ఇద్దరు నేతలు హుటాహుటీన అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం.. వారిద్దరినీ వివరణ కోరి.. డీఆర్సీ సమావేశంలో రచ్చపై ఇరువురి నేతలతో వివరణ తీసుకున్నట్టు తెలుస్తోంది. కాకినాడ డీఆర్సీ సమావేశంలో పిల్లి, ద్వారంపూడి బహిరంగంగా పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే.