రేపు విశాఖకు జగన్.. స్వరూపానంద స్వామితో భేటీ

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని ప్రత్యేకంగా కలవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. దీంతో ఆయన విశాఖ పర్యటన మంగళవారం ఖరారైందని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రేపు విశాఖ చేరుకునే ఆయన స్వరూపానందను కలవనున్నారు. ఆపై అమరావతికి బయలుదేరనున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేస్తోన్న జగన్‌.. స్వామి సలహాలు, సూచనలు తీసుకోనున్నారని తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారానికి స్వరూపానంద ముహూర్తాన్ని పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన్ను […]

రేపు విశాఖకు జగన్.. స్వరూపానంద స్వామితో భేటీ

Edited By:

Updated on: Jun 03, 2019 | 9:38 AM

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని ప్రత్యేకంగా కలవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. దీంతో ఆయన విశాఖ పర్యటన మంగళవారం ఖరారైందని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రేపు విశాఖ చేరుకునే ఆయన స్వరూపానందను కలవనున్నారు. ఆపై అమరావతికి బయలుదేరనున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేస్తోన్న జగన్‌.. స్వామి సలహాలు, సూచనలు తీసుకోనున్నారని తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారానికి స్వరూపానంద ముహూర్తాన్ని పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కలిసి కృతఙ్ఞతలు తెలియజేయాలని జగన్ నిర్ణయించుకున్నారు.