మామకు అనారోగ్యం, పరామర్శించిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న తన మామ గంగిరెడ్డిని పరామర్శించారు. తిరుపతి నుంచి  హైదరాబాద్‌‌కు చేరుకున్న ఆయన..

మామకు అనారోగ్యం, పరామర్శించిన సీఎం జగన్

Updated on: Sep 24, 2020 | 2:43 PM

ఏపీ సీఎం జగన్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న తన మామ గంగిరెడ్డిని పరామర్శించారు. తిరుపతి నుంచి  హైదరాబాద్‌‌కు చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ కు వచ్చారు. తన మామ గంగిరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగన్ భార్య భారతి తండ్రి  గంగిరెడ్డి అనారోగ్య సమస్యలతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి తన షెడ్యూల్ మార్చుకుని హైదరాబాద్ వచ్చారు. మళ్లీ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లి చేరుకుంటారు.

గురువారం ఉదయం ముఖ్యమంత్రి  వైయస్ జగన్, కర్ణాటక ముఖ్యమంత్రి  యడియూరప్పతో కలసి  తిరుమల శ్రీవారిని దర్శించుకుని, నాదనీరాజనం వద్ద జరిగిన సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు. అనంతరం తిరుమలలో కర్ణాటక సత్రాల భవన నిర్మాణ భూమి పూజకు ఇరువురు హాజరయ్యారు.

Also Read :

Dhoni In IPL : స్టేడియం బయటకు బంతి : ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

శాంసన్ ఊచకోతపై మాజీల ప్రశంసలు