Rajiv corridor: ఉత్తర తెలంగాణకు రాజమార్గం.. రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటేడ్ కారిడార్

ఉత్తర తెలంగాణకు రాజమార్గం కానున్న హైదరాబాద్–రామగుండం రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణం కోసం సీఎం రేవంత్ నేడు భూమి పూజ నిర్వహించనున్నారు. సికింద్రాబాద్‌లోని అల్వాల్‌ టిమ్స్‌ సమీపంలో ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌కు భూమి పూజ చేస్తార సీఎం రేవంత్ రెడ్డి.

Rajiv corridor: ఉత్తర తెలంగాణకు రాజమార్గం.. రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటేడ్ కారిడార్
Cm Revanth Reddy Hyderabad Ramagundam Rajiv Highway

Updated on: Mar 07, 2024 | 8:14 AM

ఉత్తర తెలంగాణకు రాజమార్గం కానున్న హైదరాబాద్–రామగుండం రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణం కోసం సీఎం రేవంత్ నేడు భూమి పూజ నిర్వహించనున్నారు. సికింద్రాబాద్‌లోని అల్వాల్‌ టిమ్స్‌ సమీపంలో ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌కు భూమి పూజ చేస్తార సీఎం రేవంత్ రెడ్డి.

కంటోన్మెంట్ ఏరియాలో రోడ్లు వెడల్పు చేసి ఎలివేటెడ్‌ కారిడార్లు నిర్మించాలని హైదరాబాద్‌లో చాలా కాలంగా ఉన్న డిమాండ్‌. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన సీఎం రేవంత్ ఢిల్లీలో రక్షణ మంత్రిని కలిసి రక్షణ భూముల అంశంపై చర్చించారు. ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణం ప్రాధాన్యతను వివరించారు. ఆ తర్వాత రక్షణ శాఖ భూములకు క్లియరెన్స్‌ ఇచ్చింది. రక్షణ శాఖ నుంచి అనుమతి లభించగానే వారం రోజుల వ్యవధిలోనే ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్. 2232 కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్–రామగుండం రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణం కోసం నేడు శంకుస్థాపన చేయనున్నారు రేవంత్. 11.3 కిలోమీటర్ల పొడవు, 6 లేన్ల వెడల్పుతో ఈ కారిడార్‌ నిర్మాణం సాగుతుంది. ఈ కారిడార్‌ కార్ఖానా, తిరుమలగిరి మీదుగా వెళ్తుంది. ఇది పూర్తయితే కరీంనగర్‌, రామగుండం రాజీవ్‌ రహదారి మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగిపోతాయి.

మార్చి 9వ తేదీన సీఎం ఎన్‌హెచ్‌-44 ఎలివేటర్‌ కారిడార్‌ పనులకు సికింద్రాబాద్‌లో శంకుస్థాపన చేస్తారు సీఎం రేవంత్‌. నేడు ప్రారంభించే కారిడార్‌తో పాటు ఈ నెల 9న ప్రారంభించబోయే రెండు కారిడార్‌ల అంచనా వ్యయం భూసేకరణ ఖర్చు మినహా సుమారు రూ. 9,000 కోట్లని అధికారవర్గాలు తెలిపాయి. కండ్లకోయ సమీపంలోని ప్యారడైజ్ నుండి ORR జంక్షన్ వరకు ఆరు-లేన్ల ఎలివేటెడ్ కారిడార్ 18.350 కి.మీ విస్తరించి ఉంది. మొత్తం 22.600 హెక్టార్ల ప్రైవేట్, రక్షణ భూమిని సేకరించాలి.

ఈ కారిడార్లు JBS నుండి శామీర్‌పేట్ అలాగే ప్యారడైజ్ నుంచి మేడ్చల్‌కు ప్రయాణించే ప్రయాణికులకు ట్రాఫిక్ రద్దీని తగ్గించగలవని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా సమయం ఆదా అవడంతో పాటు కాలుష్యం తగ్గుతుందని అధికార వర్గాలు తెలిపాయి. అన్నింటినీ మించి ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని అధికారులు తెలిపారు. PVNR ఎక్స్‌ప్రెస్ వే కాకుండా, ఈ రెండు కారిడార్‌లకు టోల్ ట్యాక్స్ ప్రతిపాదించే అవకాశాలున్నాయి. ఈ పరిణామం ఉత్తర తెలంగాణ వైపు రవాణా మార్గాలను మెరుగుపరచడానికి దోహదపడుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి.

బీఆర్‌ఎస్‌ హయాంలో చాలా కాలం యత్నించినా రక్షణ శాఖ భూముల కోసం క్లియరెన్స్‌ లభించలేదు. అయితే రేవంత్ ఈ అంశాన్ని ప్రతిష్టగా తీసుకుని రక్షణశాఖ అనుమతి పొందడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనుమతి లభించగానే వెంటనే ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ఆసక్తికర పరిణామంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…