సొంత గ్రామానికి రూ.10 కోట్లు విడుదల చేసిన సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే తన సొంత గ్రామంలో పర్యటించనున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు అక్కడికి వెళ్లలేదు. ఈ నేపథ్యలో తన సొంతగ్రామం చింతమడకకు వెళ్లాలని సీఎం ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. దీనికి సంబంధించి స్ధానికంగా ఉన్న సమస్యలు ఏమిటో తెలుసుకోవాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు, గ్రామ సర్పంచ్‌లను ఆదేశించారు. ఈ మేరకు గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు గాను చింతమడక గ్రామానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తూ నిధులను విడుదల చేశారు. ఒకరోజంతా గ్రామంలోనే […]

సొంత గ్రామానికి రూ.10 కోట్లు విడుదల చేసిన సీఎం కేసీఆర్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 10, 2019 | 8:40 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే తన సొంత గ్రామంలో పర్యటించనున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు అక్కడికి వెళ్లలేదు. ఈ నేపథ్యలో తన సొంతగ్రామం చింతమడకకు వెళ్లాలని సీఎం ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. దీనికి సంబంధించి స్ధానికంగా ఉన్న సమస్యలు ఏమిటో తెలుసుకోవాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు, గ్రామ సర్పంచ్‌లను ఆదేశించారు. ఈ మేరకు గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు గాను చింతమడక గ్రామానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తూ నిధులను విడుదల చేశారు.

ఒకరోజంతా గ్రామంలోనే ఉంటూ.. గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించనున్నారు కేసీఆర్. స్వయానా ముఖ్యమంత్రి సొంత గ్రామం కావడంతో స్ధానికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామంలో అభివృద్ధి పనుల నిమిత్తం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి ద్వారా ఈ పదికోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.