
CM KCR Urges Authorities : రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను, ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. రాష్ట్రంలో చాలా చోట్ల ఆదివారం వర్షాలు కురుస్తున్నాయి. సోమ, మంగళ వారాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమీషనర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులంతా ఎక్కడివారు అక్కడే ఉండి పరిస్థితిని గమనిస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని కోరారు.
హైదరాబాద్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పాతబస్తీలోని హుస్సేనీఆలం పీఎస్ పరిధిలోని మూసాబౌళిలో ఓ పురాతన భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో అనీషాబేగం, పర్వీన్‌బేగం చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. DRF టీమ్‌లు రంగంలోకి దిగి.. శిథిలాల కింద ఎవరూ లేరని నిర్ధారించుకుని… ఆ భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు.