వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై సీఎం ఫోకస్, నేడు సంబంధిత అధికారులతో కీలక భేటీ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది.

వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై సీఎం ఫోకస్, నేడు సంబంధిత అధికారులతో కీలక భేటీ
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 15, 2020 | 9:36 AM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది. ఇప్పటికే ధరణి ద్వారా వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. వ్యవసాయేతర ఆస్తుల ప్రక్రియను కూడా కుదిరినంత త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ధరణి పోర్టల్ పనితీరును కూడా విశ్లేశించనున్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ ప్రారంభించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎప్పటి నుంచి ప్రారంభించాలి? తదితర అంశాలపై అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

Also Read :

పాక్ దౌత్యాధికారికి భారత్ సమన్లు, సరిహద్దులో కాల్పుల విరమణకు తూట్లు పొడవడంపై ఆగ్రహం

ట్రంప్ మద్దతు దారుల నిరసన, తిరగబడ్డ వ్యతిరేక వర్గాలు, పెప్పర్ స్ప్రేను ఉపయోగించిన పోలీసులు

కొమురంభీం జిల్లాలో కానిస్టేబుల్ మిస్సింగ్, భార్య ఫిర్యాదు, ఇక్కడే అసలు ట్విస్ట్ !

‘కారు మాదే, యాక్సిడెంట్ చేసింది నా కుమారుడు కాదు’ : సైబర్‌ టవర్స్‌ వద్ద ప్రమాదంపై ఎమ్మెల్యే కాటసాని వివరణ