దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొని ఉన్నందున రాష్ట్రంలో ఆదాయం అవసరాలను బేరీజు వేసుకుని బడ్జెట్ రూపకల్పన జరపాలన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. బడ్జెట్ రూపకల్పనపై సోమవారం ప్రగతి భవన్‌లో సీనియర్ అధికారులతో కలిసి చర్చించారు. గత మార్చిలో ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశ పెట్టిన నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్ ను త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నట్లు సిఎం ప్రకటించారు. , వ్యవసాయాభివృద్ధి,ప్రజా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూనే, ఇతర రంగాలకు అవసరమైన మేర కేటాయింపులుండేలా చూడాలని అధికారులకు సూచించారు. ఇదే అంశంపై మంగళవారం కూడా సమావేశం కానున్నారు.