కేసీఆర్ ఫోన్ కు అవాక్కయ్యారు

పరిపాలనలోనే కాదు, ప్రజా సంబంధాల విషయంలోనూ కేసీఆర్..కేసీఆరే. తన పదునైన మాటలు, ప్రేమపూర్వక చర్యలతో ప్రజల నాడిని ఒడిసిపట్టుకుంటారు తెలంగాణ సీఎం. తాజాగా వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరి మండ‌లం

కేసీఆర్ ఫోన్ కు అవాక్కయ్యారు

Updated on: Sep 05, 2020 | 9:08 PM

పరిపాలనలోనే కాదు, ప్రజా సంబంధాల విషయంలోనూ కేసీఆర్..కేసీఆరే. తన పదునైన మాటలు, ప్రేమపూర్వక చర్యలతో ప్రజల నాడిని ఒడిసిపట్టుకుంటారు తెలంగాణ సీఎం. తాజాగా వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరి మండ‌లం ఏనుగ‌ల్ గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం సాయంత్రం కేసీఆర్ ఫోన్ వ్యవహారం సంచలనమైంది. అకస్మాత్తుగా స్వయంగా కేసీఆర్ నుంచి కార్యదర్శి రమాదేవికి ఫోన్ రావడంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆపై తేరుకున్న ఆమె సీఎం కేసీఆర్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఈ సంద‌ర్భంగా గ్రామంలో ఇంటి పన్నుల నిర్వహణ, అనుమతుల జారీ, ఇళ్ల యజమానుల పేరు మార్పిడి, వ్య‌వ‌సాయ భూమిని వ్య‌వ‌సాయేత‌ర భూమిగా మార్పు త‌దిత‌ర అంశాల గురించి పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి ర‌మాదేవిని సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఏనుగ‌ల్‌.. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ స్వగ్రామం కావడం గమనార్హం.