ముఖేశ్‌ గౌడ్ మృతి… ప్రముఖుల సంతాపం!

| Edited By: Pardhasaradhi Peri

Jul 29, 2019 | 5:59 PM

మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ముఖేశ్‌ గౌడ్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలను కేసీఆర్‌ స్మరించుకున్నారు. ముఖేశ్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. ముఖేశ్‌గౌడ్‌ మృతి విచారకరమని చంద్రబాబు అన్నారు. మూడు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న ముఖేశ్‌.. బీసీల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని […]

ముఖేశ్‌ గౌడ్ మృతి... ప్రముఖుల సంతాపం!
Follow us on

మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ముఖేశ్‌ గౌడ్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలను కేసీఆర్‌ స్మరించుకున్నారు. ముఖేశ్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. ముఖేశ్‌గౌడ్‌ మృతి విచారకరమని చంద్రబాబు అన్నారు. మూడు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న ముఖేశ్‌.. బీసీల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.