ఏడాదిన్న‌ర‌లోగా స్కూళ్ల‌కు మ‌హ‌ర్ద‌శ..సీఎం జ‌గ‌న్ ఆదేశం..

ఏపీలోని స్కూళ్ల‌లో మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేపట్టిన నాడు- నేడు కార్యక్రమం పనులు ఏడాదిన్నరలో కంప్లీట్ చెయ్యాల‌ని సీఎం జగన్.. అధికారులను ఆదేశించారు.

ఏడాదిన్న‌ర‌లోగా స్కూళ్ల‌కు మ‌హ‌ర్ద‌శ..సీఎం జ‌గ‌న్ ఆదేశం..

Updated on: Jul 09, 2020 | 7:45 PM

ఏపీలోని స్కూళ్ల‌లో మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేపట్టిన నాడు- నేడు కార్యక్రమం పనులు ఏడాదిన్నరలో కంప్లీట్ చెయ్యాల‌ని సీఎం జగన్.. అధికారులను ఆదేశించారు. అలాగే ఆస్పత్రులు, మెడిక‌ల్ కాలేజీల్లోనూ నాడు- నేడుకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ చేపట్టిన వివిధ పనులకు నిధుల సమీకరణపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో ముఖ్యమంత్రి జగన్ రివ్యూ నిర్వ‌హించారు. నిధుల సమీకరణపై ప‌క్కా ప్లానింగ్ ఉండాలని సూచించారు. టార్గెట్ పెట్టుకుని వేగంగా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు.

అక్టోబరు 1 నుంచి రాయలసీమ కరవు నివారణ పనులు ప్రారంభించాలి సూచించారు. పోలవరం నుంచి అదనపు జలాల తరలింపు ప్ర‌క్రియ‌ త్వరగా పూర్తి కావాల‌ని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు త్వరగా కంప్లీట్ చెయ్యాల‌ని.. పల్నాడులో కరవు నివారణ, తాగునీటి కల్పన ప‌నులు త్వ‌రగా చేప‌ట్టాల‌ని ఆదే‌శించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us