వేరు శనగల్లో రూ. 45 లక్షలు..ఇదో కొత్త తరహా స్మగ్లింగ్..

|

Feb 12, 2020 | 4:25 PM

ఢిల్లీ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడి నుంచి వండిన మాంసం ముక్కలు, వేరుశెనగలు, బిస్కెట్ ప్యాకెట్లలో దాచిన రూ .45 లక్షల విలువైన విదేశీ కరెన్సీని సిఐఎస్ఎఫ్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. దురాయికి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించడానికి మురద్ అలీని అనే వ్యక్తి  ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క టెర్మినల్ -3 వద్దకు చేరుకున్నాడు. అయితే అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించడంతో భద్రతా సిబ్బంది తనిఖీలు చేయగా.. కరెన్సీ స్మగ్లింగ్‌లో కొత్త కోణం […]

వేరు శనగల్లో రూ. 45 లక్షలు..ఇదో కొత్త తరహా స్మగ్లింగ్..
Follow us on

ఢిల్లీ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడి నుంచి వండిన మాంసం ముక్కలు, వేరుశెనగలు, బిస్కెట్ ప్యాకెట్లలో దాచిన రూ .45 లక్షల విలువైన విదేశీ కరెన్సీని సిఐఎస్ఎఫ్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. దురాయికి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించడానికి మురద్ అలీని అనే వ్యక్తి  ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క టెర్మినల్ -3 వద్దకు చేరుకున్నాడు. అయితే అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించడంతో భద్రతా సిబ్బంది తనిఖీలు చేయగా.. కరెన్సీ స్మగ్లింగ్‌లో కొత్త కోణం మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది.

ప్రయాణికుల సామాను భౌతిక తనిఖీల్లో… వండిన మటన్ ముక్కలు, వేరుశెనగ గుండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు..ఇతర తినదగిన వస్తువులలో అధిక మొత్తంలో విదేశీ కరెన్సీలు దాచబడినట్లు సిఐఎస్ఎఫ్ ప్రతినిధి అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ హేమేంద్ర సింగ్ తెలిపారు. “అక్రమ రవాణా కోసం విదేశీ కరెన్సీని దాచడానికి ఇది ఒక ప్రత్యేకమైన, విచిత్రమైన మార్గం” అని సింగ్ అన్నారు. సౌదీ రియాల్, ఖతారి రియాల్, కువైట్ దినార్, ఒమాని రియాల్, యూరోలు ఈ తనిఖీల్లో భయటపడ్డాయి. స్వాధీనం చేసుకున్న ఈ క్యాష్ విలువ రూ .45 లక్షలు వరకు ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రయాణికుడుని అదుపులోకి తీసుకున్న సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది.. కరెన్సీలను దర్యాప్తు కోసం కస్టమ్స్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. కాగా పారిశ్రామిక భద్రతా దళం ఢిల్లీ  విమానాశ్రయానికి కాపలా కాస్తోన్న విషయం తెలిసిందే.