భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) కేంద్రంపై అనుమానిత విమానాలు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. తమిళనాడు తిరునెల్వేలి జిల్లా మహేంద్రగిరిలో ఉన్న రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రొపల్షన్ రీసెర్చ్ సెంటర్‌పై అనుమానిత విమానాలు తిరగడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇస్రో ఉపగ్రహ ప్రయోగాలకు సంబంధించిన జీఎస్ఎల్వీ రాకెట్ ఇంజిన్లు, వాటి విడిభాగాలు ఈ కేంద్రంలోనే తయారవుతాయి. అయితే శనివారం తెల్లవారు జామున రెండు అనుమానిత డ్రోన్లు కేంద్రం పైన తిరుగుతున్నట్టు గుర్తించారు. ఈ కేంద్రానికి సీఐఎస్ఎఫ్ రక్షణదళంగా ఉంది. అయితే ఆకాశంలో తిరుగుతున్న రెండు విమానాల విషయాన్ని వెంటనే స్ధానిక అధికారులకు తెలియజేయగా ఈ విషయాన్ని ఢిల్లీలోని ఉన్నతాధికారులకు కూడా తెలయజెప్పారు. వారి సూచనతో పణకుడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే 2015,2017లలో కూడా డ్రోన్స్ తిరిగాయి.