నన్నంతా జైలులో కోతిలా చూస్తున్నారు..

| Edited By:

May 10, 2019 | 3:51 PM

‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’ స్కాం నిందితుడు క్రిస్టియన్ మిచెల్ కోర్టులో తన ఆవేధనను మొరపెట్టుకున్నాడు. తీహార్ జైలులో తనను అంతా ఓ కోతిలా చూస్తున్నారని, ఉడకబెట్టిన ఆహారాన్ని తనకు పడేస్తున్నారని మిచెల్ కోర్టుకు తెలిపారు. ఈ కారణంగా తాను ఏకంగా 16 కిలోల బరువు తగ్గిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. మిచెల్ ఆరోపణలపై స్పందించిన ఢిల్లీ ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్.. జైలు అధికారులకు సమన్లు జారీ చేశారు. తనకు యూరోపియన్ అల్పాహారం కావాలంటూ జైలు […]

నన్నంతా జైలులో కోతిలా చూస్తున్నారు..
Follow us on

‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’ స్కాం నిందితుడు క్రిస్టియన్ మిచెల్ కోర్టులో తన ఆవేధనను మొరపెట్టుకున్నాడు. తీహార్ జైలులో తనను అంతా ఓ కోతిలా చూస్తున్నారని, ఉడకబెట్టిన ఆహారాన్ని తనకు పడేస్తున్నారని మిచెల్ కోర్టుకు తెలిపారు. ఈ కారణంగా తాను ఏకంగా 16 కిలోల బరువు తగ్గిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. మిచెల్ ఆరోపణలపై స్పందించిన ఢిల్లీ ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్.. జైలు అధికారులకు సమన్లు జారీ చేశారు. తనకు యూరోపియన్ అల్పాహారం కావాలంటూ జైలు అధికారులను అడిగానని, అందుకు వారు నిరాకరించారని మిచెల్ కోర్టుకు విన్నవించారు. ఇక అప్పటి నుంచి జూలోని కోతిలా తనను చూస్తున్నారని కోర్టుకు తెలిపారు. కాగా, కుటుంబ సభ్యులతో కలిసి ఈస్టర్‌ను జరుపుకునేందుకు తనకు మధ్యంతర బెయిలు ఇవ్వాల్సిందిగా మిచెల్ చేసిన అభ్యర్థనను సీబీఐ కోర్టు జడ్జి తిరస్కరించారు.