chiru wishes jagan mohan reddy: సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 48వ పుట్టినరోజు జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అటు రాజకీయ ప్రముఖుల నుంచి మొదలు పెడితే ఇటు సినీ సెలబ్రిటీల వరకు జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఉదయం నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Happy Birthday to the dynamic young leader @ysjagan garu.Your resolve & your perseverance to realize goals are truly admirable.Have a wonderful year ahead! Many many happy returns of the day & May you serve the people for many many years! Stay Blessed!
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 21, 2020
ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా తన విషెస్ తెలియ జేస్తూ.. ‘డైనమిక్ యంగ్ లీడర్ వైఎస్ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. లక్ష్య సాధనలో మీ సంకల్పం, మీరు చూపిస్తోన్న పట్టుదల నిజంగా ఎంతో ప్రశంసనీయం. వచ్చే ఏడాది మీకంతా మంచి జరగాలని ఆశిస్తున్నాను. ఇలాగే మరెన్నో సంవత్సరాలు మీరు ప్రజలకు సేవచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ రాసుకొచ్చారు.