టీవీ9 చరిత్రలో నవశకం

టీవీ9 చరిత్రలో నవశకం ప్రారంభమైంది. 16 ఏళ్ల చరిత్రలో ఎన్నో సంచనాలు, ఎన్నో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని…ప్రజలకు ఎప్పటికప్పుడు సరికొత్త రీతిలో వార్తలను అందిస్తూ…నంబర్‌వన్‌గా నిలిచింది టీవీ9. అలాంటి టీవీ9 గ్రూప్‌ హెడ్‌క్వార్టర్‌ కొత్త భవనానికి ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. నూతన కార్యాలయ భవనానికి శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మై హోం గ్రూప్‌ చైర్మన్‌…టీవీ9 గ్రూప్‌ అధినేత జూపల్లి రామేశ్వరరావు, వారి కుటుంబసభ్యులు , టీవీ9 సిబ్బంది పాల్గొన్నారు. […]

టీవీ9 చరిత్రలో నవశకం

Edited By:

Updated on: Feb 10, 2020 | 10:06 PM

టీవీ9 చరిత్రలో నవశకం ప్రారంభమైంది. 16 ఏళ్ల చరిత్రలో ఎన్నో సంచనాలు, ఎన్నో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని…ప్రజలకు ఎప్పటికప్పుడు సరికొత్త రీతిలో వార్తలను అందిస్తూ…నంబర్‌వన్‌గా నిలిచింది టీవీ9. అలాంటి టీవీ9 గ్రూప్‌ హెడ్‌క్వార్టర్‌ కొత్త భవనానికి ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. నూతన కార్యాలయ భవనానికి శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మై హోం గ్రూప్‌ చైర్మన్‌…టీవీ9 గ్రూప్‌ అధినేత జూపల్లి రామేశ్వరరావు, వారి కుటుంబసభ్యులు , టీవీ9 సిబ్బంది పాల్గొన్నారు.

భూమి పూజ అనంతరం శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి టీవీ9 కార్యాలయాన్ని సందర్శించారు. ప్రజలకు సరైన వార్తలు ఇవ్వడంలో టీవీ9 మొదటి నుంచి అగ్రస్థానంలో ఉందని కొనియాడారు. వార్త ప్రసారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు.