కరోనా ఎఫెక్ట్.. గాలిలో తల్లి, కూతుళ్ల హగ్స్!

| Edited By:

Feb 09, 2020 | 2:20 PM

Corona virus Effect: చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని ఫుగో కౌంటీ పీపుల్స్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే తల్లి తన కూతురుకు ఎయిర్ హగ్ ఇస్తున్న హృదయ విదారక వీడియో.. వైరల్ అయ్యింది. కరోనా వైరస్ చైనా దేశం మొత్తం వ్యాప్తి చెందడంతో చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని ఫుగో కౌంటీ పీపుల్స్ హాస్పిటల్‌లో పనిచేయడానికి ప్రభుత్వం ఆ నర్స్‌ని ఆసుపత్రికి పిలిచారు. గత 15 రోజుల నుంచి ఆ నర్సు తన తొమ్మిదేళ్ల కూతురుని చెంగ్ షివెన్‌‌ని చూడలేదు. […]

కరోనా ఎఫెక్ట్.. గాలిలో తల్లి, కూతుళ్ల హగ్స్!
Follow us on

Corona virus Effect: చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని ఫుగో కౌంటీ పీపుల్స్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే తల్లి తన కూతురుకు ఎయిర్ హగ్ ఇస్తున్న హృదయ విదారక వీడియో.. వైరల్ అయ్యింది. కరోనా వైరస్ చైనా దేశం మొత్తం వ్యాప్తి చెందడంతో చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని ఫుగో కౌంటీ పీపుల్స్ హాస్పిటల్‌లో పనిచేయడానికి ప్రభుత్వం ఆ నర్స్‌ని ఆసుపత్రికి పిలిచారు. గత 15 రోజుల నుంచి ఆ నర్సు తన తొమ్మిదేళ్ల కూతురుని చెంగ్ షివెన్‌‌ని చూడలేదు.

15 రోజుల తర్వాత తల్లి కోసం ఆమె కూతురు లంచ్ బాక్స్ ఆసుపత్రికి తీసుకొని వచ్చింది. కరోనా వైరస్ ఒకరిని తాకడం వలన కూడా కరోనా సోకుతున్న నేపథ్యంలో నర్సుగా పనిచేసే తల్లి.. కూతురిని కలవకుండా దూరం నుంచే మాట్లాడి గాలిలో కౌగిలి ఇచ్చింది తల్లి. తన కూతురు ఏడుస్తున్న కూడా.. కుమార్తెను పట్టుకుని ఓదార్చలేక.. ఆ తల్లి బిడ్డ దూరం గానే నిలబడి ఇద్దరు గాలిలోనే కౌగిలింత ఇచ్చుకున్నారు.

ఆ తల్లి తన కూతుర్ని దగ్గరికి పిలిచి ఓదార్చకపోవడానికి కారణం.. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని కరోనావైరస్ రోగుల కోసం ఒక ఆసుపత్రిలో ఆ తల్లి పనిచేస్తుండటమే. ఈ ఘటన అంతా చైనాకు చెందిన జిన్హువా న్యూస్ ఈ వీడియోని ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.

ఆ వీడియోలో తల్లి కూతురు ల సంభాషణ:

అమ్మ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను- కూతురు

అమ్మ రాక్షసులతో పోరాడుతోంది-అమ్మ

దేశం నుంచి వైరస్ ని పొగట్టిన తర్వాత నేను ఇంటికి తిరిగి వస్తాను- అమ్మ

ఇద్దరు గాలిలోనే కౌగిలి ఇచ్చుకుంటారు…

వారిద్దరూ మాస్క్‌లు ధరించి ఈ సంభాషణ జరుగుతుంది. చివరికి… ఆ కూతురు తన తల్లి కోసం తెచ్చిన.. లంచ్ బాక్స్ కూడా దూరంగా భూమి మీదనే పెట్టేసి వెళ్లిపోతుంది. ఈ వీడియోలో జరిగిన ఘటనని చూస్తే. కరోనా వైరస్ చైనా మొత్తం ఎంత బాధ పడుతున్నారో మనకు అవుతుంది.

సేరి సురేశ్
టీవీ9 జర్నలిస్టు