షాకింగ్ న్యూస్…ఆ డాక్ట‌ర్లు క‌రోనాను గెలిచారు..కానీ చ‌ర్మం రంగు..

|

Apr 21, 2020 | 9:25 PM

కోవిడ్ బారిన ప‌డిన‌ ఇద్దరు చైనీస్ డాక్టర్ల చర్మం నలుపు రంగులోకి మారిపోయింది. కాలేయం దెబ్బతినడంతోనే ఇలా జరిగింద‌ని డాక్ట‌ర్లు చెప్తున్నారు. జనవరిలో వుహాన్ సెంట్రల్ ఆస్ప‌త్రిలో కోవిడ్ బాధితుల‌కు ట్రీట్మెంట్ అందిస్తోన్న సమయంలో డాక్టర్ యీ ఫాన్, డాక్టర్ హు వియిన్‌ఫెంగ్ ల‌కు కోవిడ్ సోకింది. వీరిద్దరూ వెంటిలేట‌ర్స్ పై మీద చికిత్స పొందారు. చావుతో పోరాటం చేసి గెలిచిన‌ప్ప‌టికీ.. వారి శ‌రీరం రంగు మాత్రం నలుపులోకి మారిపోయింది. ఇన్ఫెక్షన్ కారణంగా లివ‌ర్ దెబ్బతినడం, హార్మోన్స్ […]

షాకింగ్ న్యూస్...ఆ డాక్ట‌ర్లు క‌రోనాను గెలిచారు..కానీ చ‌ర్మం రంగు..
Follow us on

కోవిడ్ బారిన ప‌డిన‌ ఇద్దరు చైనీస్ డాక్టర్ల చర్మం నలుపు రంగులోకి మారిపోయింది. కాలేయం దెబ్బతినడంతోనే ఇలా జరిగింద‌ని డాక్ట‌ర్లు చెప్తున్నారు. జనవరిలో వుహాన్ సెంట్రల్ ఆస్ప‌త్రిలో కోవిడ్ బాధితుల‌కు ట్రీట్మెంట్ అందిస్తోన్న సమయంలో డాక్టర్ యీ ఫాన్, డాక్టర్ హు వియిన్‌ఫెంగ్ ల‌కు కోవిడ్ సోకింది. వీరిద్దరూ వెంటిలేట‌ర్స్ పై మీద చికిత్స పొందారు. చావుతో పోరాటం చేసి గెలిచిన‌ప్ప‌టికీ.. వారి శ‌రీరం రంగు మాత్రం నలుపులోకి మారిపోయింది.

ఇన్ఫెక్షన్ కారణంగా లివ‌ర్ దెబ్బతినడం, హార్మోన్స్ లో స‌మ‌తుల్య‌త లేక‌పోవ‌డం వల్ల ఆ వైద్యుల‌ చర్మం నలుపు రంగులోకి మారిందని వారికి ట్రీట్మెంట్ అందించిన డాక్టర్ చైనీస్ పాత్రికేయుల‌కు తెలిపారు. కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ యీకు జనవరి 18న కోవిడ్ సోకింది. మ‌హ‌మ్మారితో 39 రోజులపాటు పోరాడిన ఆయన.. ఎక్మో అనే లైఫ్ సపోర్టింగ్ మెషీన్ సాయంతో వైర‌స్ ను ఓడించారు. ఎక్మో (ECMO) పరికరం ఆక్సిజన్‌ను రక్తంలోకి పంప్ చేస్తుంది. అంటే గుండె, లంగ్స్ చేసే పనిని ఇది చేస్తుంది.

ఇక‌ యూరాలజిస్ట్ అయిన డాక్టర్ హు కోవిడ్ తో ఏకంగా 99 రోజులపాటు మంచానికే పరిమితమయ్యారు. వీరిద్దరూ డాక్టర్ వెన్‌లియాంగ్‌తో కలిసి వ‌ర్క్ చేశారు. డాక్టర్ వెన్‌లియాంగ్ కరోనా గురించి డిసెంబర్లోనే చైనాను హెచ్చరించారు. కానీ అధికారులు నుంచి హెచ్చరిక‌లు రావ‌డంతో ఆయన వెనక్కి తగ్గారు. డాక్టర్ లీ కరోనా కారణంగా ఫిబ్రవరి 7న ప్రాణాలు కోల్పోయారు. కరోనా ట్రీట్మెంట్ ఆరంభంలో వాడిన వాడిన మందుల వల్ల ఈ ఇద్దరు డాక్టర్ల చర్మం నలుపు రంగులోకి మారి ఉంటుందని వారికి వైద్యం అందించిన డాక్టర్ లీ షుషెంగ్ భావించారు. కాలేయ ప‌నితీరు నార్మ‌ల్ అయితే చ‌ర్మం కూడా నార్మ‌ల్ రంగులోకి రావొచ్చ‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.