AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కరోనా రిపోర్టర్’ ఏడీ ? 24 గంటలు గడిచినా దొరకని ఆచూకీ

చైనాలోని వూహాన్ సిటీలోనే ఉంటూ ఎప్పటికప్పుడు కరోనా గురించి సమాచారం తెలిపే ఇద్దరు చైనా జర్నలిస్టుల్లో ఒకరు కనబడకుండా పోయారు. ఛెన్ కియుషి, ఫాంగ్ చిన్ అనే ఇద్దరిలో చెన్ జాడ తెలియడంలేదు. వీరు తమ మొబైల్ ఫోన్ల ద్వారా.. కరోనా ఔట్ బ్రేక్ మొదలైనప్పటి నుంచి జనాలకు సమాచారాన్ని చెబుతూ వచ్చారు. ఈ జర్నలిస్టులు చెప్పే వార్తల్లో చాలావరకు ట్విటర్లలో వీడియోల ద్వారా పోస్ట్ అయ్యేవి. అలాగే యూట్యూబ్ లో రీ-పోస్ట్ కూడా అవుతూ వచ్చాయి. […]

'కరోనా రిపోర్టర్'  ఏడీ ? 24  గంటలు గడిచినా దొరకని ఆచూకీ
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 10, 2020 | 12:13 PM

Share

చైనాలోని వూహాన్ సిటీలోనే ఉంటూ ఎప్పటికప్పుడు కరోనా గురించి సమాచారం తెలిపే ఇద్దరు చైనా జర్నలిస్టుల్లో ఒకరు కనబడకుండా పోయారు. ఛెన్ కియుషి, ఫాంగ్ చిన్ అనే ఇద్దరిలో చెన్ జాడ తెలియడంలేదు. వీరు తమ మొబైల్ ఫోన్ల ద్వారా.. కరోనా ఔట్ బ్రేక్ మొదలైనప్పటి నుంచి జనాలకు సమాచారాన్ని చెబుతూ వచ్చారు. ఈ జర్నలిస్టులు చెప్పే వార్తల్లో చాలావరకు ట్విటర్లలో వీడియోల ద్వారా పోస్ట్ అయ్యేవి. అలాగే యూట్యూబ్ లో రీ-పోస్ట్ కూడా అవుతూ వచ్చాయి. అయితే 20 గంటలు గడిచిపోయినా.. చెన్ ఏమైపోయాడో అంతుబట్టడంలేదు. ఇక ఫాంగ్ బిన్ ను అధికారులు కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నారు. ఓ ఆసుపత్రిలో కరోనా మృతుల తాలూకు  వీడియోను అతడు పోస్ట్ చేయడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఈ హాస్పిటల్ లో చెల్లా చెదరుగా పడి ఉన్న మృత దేహాలను ఫాంగ్ వీడియో తీశాడట. హజ్మత్ సూట్లు ధరించిన కొందరు తన ఫ్లాట్ తలుపులు బద్దలు కొట్టి తనను ఒక చోటికి తీసుకువెళ్లిన ఘటనను ఆయన వీడియో తీశాడు. అంతే ! అతడ్ని వెంటనే విడుదల చేయాలంటూ వందలాది కామెంట్లు ట్విటర్లలో దర్శనమిచ్చాయి. అప్పటినుంచే చెన్ జాడ లేదు. తన చుట్టూ జరుగుతున్న కరోనా కేసులపై నిర్విరామంగా సమాచారం ఇచ్ఛే ఇతనికి అనేకమంది ఫాలోవర్లు ఉన్నారు. వాస్తవాలను ఇతడే ఖఛ్చితంగా చెబుతాడనే పేరుందట. కరోనా మృతుల గురించి ఎవరూ పట్టించుకోకపోవడం, రోగుల పట్ల డాక్టర్ల నిర్లక్ష్యం, తదితరాలను స్థానికులు కూడా కొంతమంది వీడియోలుగా తీశారు. కాగా-స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి ఏడు గంటల నుంచి చెన్ కనబడడం లేదని అతని ఫ్రెండ్స్ అతని ట్విట్టర్లో ఓ మెసేజ్ పోస్ట్ చేశారు. చెన్ భద్రతపై వారు ఆందోళన చెందుతున్నారు.