చైనీస్ కోవిడ్ వ్యాక్సీన్ వలంటీర్ లో యాంటీ బాడీలు !

| Edited By: Anil kumar poka

Oct 18, 2020 | 3:56 PM

చైనాలో కోవిడ్ 19 వ్యాక్సీన్ తీసుకున్న ఓ వలంటీర్ లో యాంటీ బాడీలు ఉత్పన్నమయ్యాయని రీసెర్చర్లు కనుగొన్నారు. ఇనాక్టివేట్ చేసిన సార్స్-కోవ్-2 వైరస్ ఆధారంగా ఈ  వ్యాక్సీన్  తయారు చేశామని, ఇది తీసుకున్న ఓ వలంటీర్ లో...

చైనీస్ కోవిడ్ వ్యాక్సీన్ వలంటీర్ లో యాంటీ బాడీలు !
Coronavirus Vaccine
Follow us on

చైనాలో కోవిడ్ 19 వ్యాక్సీన్ తీసుకున్న ఓ వలంటీర్ లో యాంటీ బాడీలు ఉత్పన్నమయ్యాయని రీసెర్చర్లు కనుగొన్నారు. ఇనాక్టివేట్ చేసిన సార్స్-కోవ్-2 వైరస్ ఆధారంగా ఈ  వ్యాక్సీన్  తయారు చేశామని, ఇది తీసుకున్న ఓ వలంటీర్ లో 42 రోజుల్లో యాంటీ బాడీలు ఉత్పన్నమయ్యాయని వారు తెలిపారు. తమ పరిశోధనా ఫలితాలను వారు లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్ లో ప్రచురించారు. ఈ ఏడాది ఏప్రిల్ 29-జులై మధ్య కాలంలో ఇతనికి ఈ టీకా మందు ఇచ్చామని, సురక్షితంగా ఉన్నాడని వారు వెల్లడించారు. అయితే మరిన్ని పరిశోధనలు చేయవలసి ఉందన్నారు.

చైనాలో 18 నుంచి 80 ఏళ్ళ మధ్య వయస్సువారిలో ఆరోగ్యవంతులైన సుమారు 600 మందిని ఎంపిక చేసి కోవిడ్ వ్యాక్సీన్ ఇచ్చారు. ఈ దేశంలో నాలుగు వ్యాక్సీన్లు తుది దేశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి. వీటిలో మూడింటిని ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ కింద అత్యవసరమైనవారికి అందుబాటులో ఉంచారు.