భారత్‌లో డ్రాగన్ గూఢచార్యం.. చైనా లిస్టులో మన నేతలు

|

Sep 14, 2020 | 11:42 AM

సరిహద్దుల్లో ఆక్రమణలకు ప్రయత్నించి భంగపడ్డ చైనా .. ఇప్పుడు మనల్ని దొంగ దెబ్బ తీసేందుకు పావులు కదుపుతోంది. మన రహస్యాలను తెలుసుకునేందుకు.. నిఘా పెట్టింది.

భారత్‌లో డ్రాగన్ గూఢచార్యం.. చైనా లిస్టులో మన నేతలు
Follow us on

సరిహద్దుల్లో ఆక్రమణలకు ప్రయత్నించి భంగపడ్డ చైనా .. ఇప్పుడు మనల్ని దొంగ దెబ్బ తీసేందుకు పావులు కదుపుతోంది. మన రహస్యాలను తెలుసుకునేందుకు.. నిఘా పెట్టింది. ఏకంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ బాబ్డే.. కీలక స్థానాల్లో ఉన్న ఆర్మీ అధికారులతో పాటు వ్యాపారులు, జర్నలిస్టులు.. ఇలా మొత్తం 10 వేల మందిని..చైనాకు చెందిన ఓ కంపెనీ ట్రాక్ చేస్తోందంటూ ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రచురించిన కథనం..దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ కథనం ప్రకారం..చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న జెన్హువా డాటా ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ కంపెనీ.. భారత్‌లో గూఢచార్యం చేస్తోంది. పూర్తిగా టెక్నాలజీ ఆధారంగా చేసుకుని చేస్తున్న ఈ నిఘాలో.. రాష్ట్రపతి నుంచి సైనికాధికారుల వరకూ అందరి కదలికలు, సంభాషణలు సేకరించి చైనా ప్రభుత్వానికి అందిస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో మొత్తం 10 వేల మంది ఈ జిన్షువా ట్రాకింగ్‌లో ఉన్నారు.

ఇక ఎల్‌ఏసీ వెంబడి ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధంగా ఉందన్నారు ప్రధాని. ధైర్య సాహసాలతో మాతృ భూమిని కాపాడేందుకు సైనికులు సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తున్నారని..దేశ ప్రజలు, పార్లమెంట్ జవాన్లతోనే ఉందన్న సందేశాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు.