చైనాని షేక్ చేస్తోన్న కరోనా వైరస్!

| Edited By:

Jan 31, 2020 | 3:52 PM

కరోనా వైరస్ చైనాని షేక్ చేస్తుంది. కరోనా వైరస్‌ దెబ్బకి చైనా దేశవ్యాప్తంగా కలకలంగా మారింది. పోతులూరి వీర బ్రహ్మేంద్ర గారు చెప్పినట్టు.. ఈ వ్యాధిసోకిన వారు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటికే చైనాలో ఈ వైరస్ సోకి 200 మందికి పైగా మరణించారు. అంతేకాకుండా.. దాదాపు రెండు వేల మందికి పైగా ఈ కరోనా వైరస్ బారిన పడ్డినట్లు అక్కడి వైద్యులు అధికారికంగా తెలిపారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అలాగే వేల […]

చైనాని షేక్ చేస్తోన్న కరోనా వైరస్!
Follow us on

కరోనా వైరస్ చైనాని షేక్ చేస్తుంది. కరోనా వైరస్‌ దెబ్బకి చైనా దేశవ్యాప్తంగా కలకలంగా మారింది. పోతులూరి వీర బ్రహ్మేంద్ర గారు చెప్పినట్టు.. ఈ వ్యాధిసోకిన వారు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటికే చైనాలో ఈ వైరస్ సోకి 200 మందికి పైగా మరణించారు. అంతేకాకుండా.. దాదాపు రెండు వేల మందికి పైగా ఈ కరోనా వైరస్ బారిన పడ్డినట్లు అక్కడి వైద్యులు అధికారికంగా తెలిపారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అలాగే వేల సంఖ్యలో పలు అనుమానపు కేసులు నమోదయ్యాయని వారు పేర్కొన్నారు.

చైనాలో అంతకంతకూ కరోనా విజృంభిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఈ కరోనా వైరస్ ధాటికి.. ప్రపంచ దేశాలు కూడా వణికిపోతున్నాయి. ఇప్పటికే ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్.. ప్రపంచంలోని అన్ని దేశాల్లోని పలువురికి సోకింది. దీంతో చైనీయుల రాకను ఇతర దేశాలు నిలిపివేశాయి. వివిధ దేశాల నుంచి వచ్చే వారికి కూడా ఎయిర్‌పోర్టుల్లో కరోనా వైరస్ టెస్టులను నిర్వహిస్తున్నారు. కాగా.. ఈ కరోనా వైరస్‌కి భారతదేశంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరికొన్ని అనుమానపు కేసులు నమోదు అయ్యాయి.