కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో కొత్తగా కలవరం.. ఐదు నెలల తరువాత పెరుగుతున్న కేసులు

|

Jan 11, 2021 | 11:09 AM

చైనాలో ఐదు నెలల తరువాత తిరిగి అత్యధిక కేసులు నమోదయ్యాయని ఆదేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో కొత్తగా కలవరం.. ఐదు నెలల తరువాత పెరుగుతున్న కేసులు
Representative Image
Follow us on

China rises Covid19: చైనాలో పురుడుపోసుకున్న కరోన వైరస్ మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది. కోట్లాది మంది మాయదారి రోగం బారిన విలవిలలాడుతున్నారు. ఇప్పడిప్పుడే తేరుకుని అయా దేశాలు కుదుటపడుతున్నాయి.అయితే, ఇప్పుడు మరోమారు చైనాలో కరోనా వైరస్ విజ‌‌ృంభణ కొనసాగుతుంది. ఐదు నెలల తరువాత తిరిగి అత్యధిక కేసులు నమోదయ్యాయని ఆదేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. చైనా ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం హుబెయీ ప్రాంతంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం పలు నగరాల్లో మరోమారు లాక్‌డౌన్ విధించింది.

అలాగే, కరోనా నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని, ప్రజలు ఇందుకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. హీలోంగ్జియాంగ్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలలోనూ కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ కూడా మరోమారు లాక్‌డౌన్ విధించింది ఆదేశ ప్రభుత్వం. హుబెయీలో కొత్తగా 85 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే కరోనా కేసులు తక్కువగా నమోదైనప్పటికీ… కేసుల సంఖ్య మరింతగా పెరగకుండా ఉండేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.

Read Also…

ఒడిశాలో పాఠశాలల్లో కరోనా కలవరం.. 31 మంది ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు పాజిటివ్