గాల్వన్ లో చొరబాటుకు చైనా ముందే వ్యూహం

| Edited By: Pardhasaradhi Peri

Aug 11, 2020 | 6:26 PM

లడాఖ్ సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో గత జూన్ నెలలో భారత-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణ కాకతాళీయం, కాదని, చైనా ముందుగానే ప్లాన్ చేసుకున్నదని తెలిసింది. ఈ లోయలోని..

గాల్వన్ లో చొరబాటుకు చైనా ముందే వ్యూహం
Follow us on

లడాఖ్ సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో గత జూన్ నెలలో భారత-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణ కాకతాళీయం, కాదని, చైనా ముందుగానే ప్లాన్ చేసుకున్నదని తెలిసింది. ఈ లోయలోని ఫింగర్ 4 నుంచి హాట్ స్ప్రింగ్ ప్రాంతం వరకు చొరబడడానికి డ్రాగన్ కంట్రీ సమగ్ర సన్నాహాలు చేసుకున్నట్టు యూఎస్ ఇంటెలిజెన్స్ సంస్థలు, భారత భద్రతా ఏజెన్సీలు తమ వేర్వేరు నివేదికల్లో తెలిపాయి. కొన్ని చోట్ల చైనా అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఆయుధాలను, టీ-15 ట్యాంకులను టిబెట్ వద్ద మోహరించింది.

తేలికపాటి గన్స్ తో కూడిన ఈ ట్యాంకులను సులభంగా ఎత్తయిన కొండ ప్రదేశాలకు హెలికాఫ్టర్ల ద్వారా కూడా తరలించవచ్చునట. గత జనవరిలోనే చైనా టిబెట్ లో వీటిని సర్వ సన్నద్ధంగా ఉంచినట్టు వెల్లడైంది. అయితే ఇండియా వీటికన్నా శక్తిమంతమైన ట్యాంకులను, ఇతర ఆయుధాలను మోహరించి ఉంచింది.