కరోనా వైరస్ పై పోరులో మాదే విజయం, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్
కరోనా వైరస్ ని హ్యాండిల్ చేయడంలో తమ దేశం అసాధారణమైన, చరిత్రాత్మక పరీక్షలో విజయం సాధించిందని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ప్రకటించారు. కోవిడ్ పై నిర్విరామ పోరు జరుపుతున్న డాక్టర్లకు, ఇతర వైద్య సిబ్బందికి...
కరోనా వైరస్ ని హ్యాండిల్ చేయడంలో తమ దేశం అసాధారణమైన, చరిత్రాత్మక పరీక్షలో విజయం సాధించిందని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ప్రకటించారు. కోవిడ్ పై నిర్విరామ పోరు జరుపుతున్న డాక్టర్లకు, ఇతర వైద్య సిబ్బందికి అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మంగళవారం బీజింగ్ లో జరిగిన ఈ ఈవెంట్ లో ఆయన నలుగురు ‘హీరో’లకు గోల్డ్ ఎవార్డ్స్ అందజేశారు. ఈ ‘ యుద్డం’ లో అతి వేగంగా మనం సక్సెస్ సాధించామని, ఎకానమీ రీకవరీలోను, కోవిడ్ పై పోరాటంలోనూ ప్రపంచంలో మనమే ముందంజలో ఉన్నామని జీ జిన్ పింగ్ పేర్కొన్నారు. కాగా..అవార్డు గ్రహీతల్లో 83 ఏళ్ళ వైద్య నిపుణుడు కూడా ఉన్నారు.
ఒక విధంగా మనం ‘హీరోలం’ అని ఆయన అభివర్ణించినప్పుడు కార్యక్రమానికి హాజరైన అనేకమంది హర్షాతిరేకంతో చప్పట్లు కొట్టారు. కరోనా వైరస్ ని చైనా చాలా ‘జాగరూకత’ తో నియంత్రించగలిగిందని ప్రపంచ దేశాలు ఆమోదిస్తున్నాయి.