‘అలా అయితే.. ఇలా చేస్తాం..’ చైనా వార్నింగ్

కరోనా వైరస్ కారకులుగా చైనాపై పీకవరకూ కోపం పెంచుకుంది అగ్రదేశం అమెరికా. ఈ క్రమంలో అనేక విమర్శలు గుప్పిస్తూ వస్తోంది. ఇటీవల చైనాకు చెందిన టిక్‌టాక్ తోపాటు ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వీచాట్‌ పైనా నిషేధం తప్పదంటూ...

'అలా అయితే.. ఇలా చేస్తాం..' చైనా వార్నింగ్

కరోనా వైరస్ కారకులుగా చైనాపై పీకవరకూ కోపం పెంచుకుంది అగ్రదేశం అమెరికా. ఈ క్రమంలో అనేక విమర్శలు గుప్పిస్తూ వస్తోంది. ఇటీవల చైనాకు చెందిన టిక్‌టాక్ తోపాటు ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వీచాట్‌ పైనా నిషేధం తప్పదంటూ అమెరికా సంకేతాలిచ్చింది. దీనికి చైనా ప్రభుత్వం ఘాటుగా రియాక్టైంది. అమెరికా తమ దేశానికి చెందిన వీ చాట్‌ను బ్యాన్ చేస్తే ఆ దేశానికి చెందిన ఆపిల్ ఉత్పత్తులను తాము బాయ్ కాట్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు చైనా విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ ప్రకటన చేశారు. వీచాట్‌ను అమెరికా బ్యాన్ చేస్తే చైనీయులు తయారుచేసే ఐఫోన్లు(సాఫ్ట్ వేర్ ప్రొవైడర్స్ అమెరికా), ఇతర యాపిల్ ఉత్పత్తుల వాడకాన్ని చైనీయులు నిలిపివేస్తారని హెచ్చరించారు.

ఈ తాజా ప్రకటనపై చైనా వాసులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. చైనాకు చెందిన వీచాట్ యాప్‌లో ప్రస్తుతం 1.2 బిలియన్ల మంది వినియోగదారులున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ టిక్ టాక్, వీచాట్ ను బ్యాన్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించి.. నిర్దేశిత గడువులోగా ఆయా కంపెనీలు తమ అమెరికా బిజినెస్‌ను ఇతర ఏదైనా అమెరికన్ కంపెనీకి విక్రయించాలంటూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను కూడా విడుదల చేశారు. దీనిపై ఇప్పుడు చైనా విదేశాంగ శాఖ పై విధంగా కౌంటరిచ్చింది.

Click on your DTH Provider to Add TV9 Telugu