శ్రీవారి సేవలో పాల్గొనేందుకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ తిరుమలకు చేరుకున్నారు. బుధవారం ఉదయం శ్రీవారిని ఆయన దర్శించుకోనున్నారు. అతిధి గృహం వద్ద చేరుకున్న చౌహాన్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు.
ఈ రాత్రికి సీఎం శివరాజ్‌సింగ్ తిరుమలలోనే బస చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అంతకుముందు శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలంగాణలోని ముచ్చింతల్‌కు వెళ్లారు. అక్కడ చిన్న జీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకుని తిరుమల పర్యటనకు బయల్దేరారు.