AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్నారి కారుణ్య మరణంపై చలించిన ఏపీ సీఎం…. ఆయన ఏం చేశారో తెలుసా?

ఏడాది వయసున్న తమ చిన్నారి కారుణ్యమరణానికి అనుమతి ఇవ్వాలని ఏపీ హైకోర్టును కోరిన దంపతుల హృదయ విదారకమైన ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఈ వార్తను విన్న ఆయన చలించిపోయారు. వెంటనే ఆ చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ తో స్వయంగా మాట్లాడి, పాప ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగారు. సుహానా చికిత్సకు అవసరమైన మొత్తం ఖర్చును సీఎం సహాయనిధి నుంచి విడుదల చేయాలని ఆదేశించారు. చిన్నారికి […]

చిన్నారి కారుణ్య మరణంపై చలించిన ఏపీ సీఎం.... ఆయన ఏం చేశారో తెలుసా?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 12, 2019 | 12:52 PM

Share

ఏడాది వయసున్న తమ చిన్నారి కారుణ్యమరణానికి అనుమతి ఇవ్వాలని ఏపీ హైకోర్టును కోరిన దంపతుల హృదయ విదారకమైన ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఈ వార్తను విన్న ఆయన చలించిపోయారు. వెంటనే ఆ చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ తో స్వయంగా మాట్లాడి, పాప ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగారు. సుహానా చికిత్సకు అవసరమైన మొత్తం ఖర్చును సీఎం సహాయనిధి నుంచి విడుదల చేయాలని ఆదేశించారు. చిన్నారికి రోజువారీ చికిత్సకు అవసరమయ్యే ఇన్సులిన్‌ ను ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఉచితంగా అందించాలని కూడా సీఎం జగన్ ఆదేశించారు.

చిత్తూరు జిల్లా బి. కొత్తకోటకు చెందిన దంపతులు బావాజాన్, షబానాలకు ఇంతకుముందు ఇద్దరు పిల్లలు జన్మించారు. వారు కూడా ఘగర్ లెవెల్స్ పడిపోవడంతో మృతి చెందారు. గత ఏడాది సుహానా జన్మించింది. ఈ చిన్నారికి కూడా ఘగర్ లోపం ఉందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రుల గుండె చెరువైంది. వైద్యం చేయించే స్థోమత లేకపోవడంతో వీరు కారుణ్యమరణానికి అనుమతి ఇవ్వాలని హైకోర్టుకు కోరారు. దీంతో మీడియాలో వచ్చిన కథనాలతో సీఎం జగన్ స్పందించి సుహానాకు వెంటనే వైద్యం చేయించాలని ఆదేశించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.