కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సీబీఐ కోర్టులో మరో షాక్ తగిలింది. మరో నాలుగురోజుల పాటు కస్టడీని పొడిగిస్టున్నట్లు సీబీఐ కోర్టు తెలిపింది. దీంతో ఈ నెల 30 వరకు చిదంబరం సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అంతకుముందు చిదంబరానికి సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. చిదంబరం బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఇక సీబీఐ కస్టడీపై జోక్యం చేసుకోవడానికి కూడా సుప్రీం నిరాకరించింది. రెగ్యులర్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది.