ఏపీ :వారి అకౌంట్ల‌లో నేరుగా రూ.10వేలు జమ

|

Nov 10, 2020 | 9:40 PM

ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాల విషయంలో మాత్రం అస్సలు వెనక్కి తగ్గడం లేదు. అర్హత ఉన్న ఏ ఒక్క లబ్దిదారుడిని వదిలి పెట్టకుండా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందిస్తున్నారు.

ఏపీ :వారి అకౌంట్ల‌లో నేరుగా రూ.10వేలు జమ
Follow us on

ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాల విషయంలో మాత్రం అస్సలు వెనక్కి తగ్గడం లేదు. అర్హత ఉన్న ఏ ఒక్క లబ్దిదారుడిని వదిలి పెట్టకుండా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందిస్తున్నారు. తొలుత ఎవరికైనా అన్యాయం జరిగితే, మరోసారి అర్హతలను పరిశీలించి న్యాయం చేస్తున్నారు. తాజాగా మంగళవారం ‘జగనన్న చేదోడు’ పథకం కింద మరో 51,390 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నగదు బదిలీ చేసింది. ఈ పథకం కింద ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని మంత్రి వేణుగోపాలకృష్ణ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ట్రాన్స్‌ఫర్ చేశారు. బీసీ శాఖ మంత్రిగా జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించడానికి అవకాశం రావటం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. అర్హులైన అబ్దిదారులకు అన్ని పథకాలు తప్పకుండా అందజేస్తామన్నారు. జగనన్న చేదోడు పథకం ద్వారా మొదటి విడతలో అర్హత ఉన్న రజకులు, టైలర్లు, నాయీబ్రాహ్మణులకు  2,47,040 మంది లబ్ధి పొందారని వెల్లడించారు. మంగళవారం 51, 390 మంది లబ్ది చేకూరిందని తెలిపారు. ఈ పథకంలో ఎటువంటి సిఫార్సులు లేకుండా కేవలం అర్హులను వెతికి పట్టుకుని మరి వారికి లబ్ది చేకూర్చుమని వివరించారు.

Also Read :

ఏపీలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీపై స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు

తెలంగాణ : పిడుగుపాటు బాధిత కుటుంబాలకు పరిహారం విడుదల