చెక్ బౌన్స్ కేసులో వీరికి అరెస్ట్ వారెంట్

| Edited By: Pardhasaradhi Peri

Jun 30, 2019 | 2:25 PM

నటులు రాధిక, శరత్‌కుమార్‌లకు చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. వీరిని అరెస్టు చేయాలని చెన్నైలోని సైదాపేట కోర్టు ఆదేశాలు జారీచేసింది. రేడియన్స్ మీడియా సంస్ధకు నటి రాధిక, ఆమె భర్త శరత్‌కుమార్‌, నిర్మాత లిస్టిన్ స్టీఫెన్‌లు కలిసి రూ.2 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇదే విషయంలో రేడియన్స్ సంస్ధ కోర్టులో కేసు దాఖలు చేసింది. తమకు చెల్లించాల్సిన రూ.2 కోట్లను ఇవ్వడం లేదంటూ ఆరోపించింది. ఈ కేసులో కోర్టు పలుమార్లు నోటీసులు కూడా […]

చెక్ బౌన్స్ కేసులో వీరికి  అరెస్ట్ వారెంట్
Follow us on

నటులు రాధిక, శరత్‌కుమార్‌లకు చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. వీరిని అరెస్టు చేయాలని చెన్నైలోని సైదాపేట కోర్టు ఆదేశాలు జారీచేసింది. రేడియన్స్ మీడియా సంస్ధకు నటి రాధిక, ఆమె భర్త శరత్‌కుమార్‌, నిర్మాత లిస్టిన్ స్టీఫెన్‌లు కలిసి రూ.2 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇదే విషయంలో రేడియన్స్ సంస్ధ కోర్టులో కేసు దాఖలు చేసింది. తమకు చెల్లించాల్సిన రూ.2 కోట్లను ఇవ్వడం లేదంటూ ఆరోపించింది.

ఈ కేసులో కోర్టు పలుమార్లు నోటీసులు కూడా పంపింది. అయినప్పటికీ వీరినుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రాధిక, శరత్‌కుమార్‌లను అరెస్ట్ చేయాలంటూ ఆదేశించింది సైదాపేట కోర్టు. రేడియన్స్ సంస్థ నుంచి డబ్బు తీసుకుని నిర్మాత లిస్టిన్ స్టీఫెన్‌తో కలిసి శరత్‌కుమార్,  రాధికలు సినిమాలు నిర్మించారు. దాన్ని తిరిగి ఇస్తున్నట్టుగా  రూ.2 కోట్లకు పైగా చెక్కును కూడా ఇచ్చారు. అయితే  ఆ చెక్కు బౌన్స్  కావడంతో రేడియన్స్ సంస్ధ న్యాయం కోసం కోర్టుకెక్కింది. దీంతో వీరిని అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు.  ఈ కేసు తదుపరి విచారణను జూలై 12కి వాయిదా వేశారు.