ఏపీ : బ్యాంక్‌ ఉద్యోగాల పేరుతో కోట్లు స్వాహా

|

Nov 10, 2020 | 9:56 PM

మాయలు , మోసాలు పెరిగిపోతున్నాయి. కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. అందుగలదు, ఇందు లేదు అన్నట్లుగా ఇప్పుడు ప్రతి దాంట్లో మోసం కామనైపోయింది.

ఏపీ :  బ్యాంక్‌ ఉద్యోగాల పేరుతో కోట్లు స్వాహా
Follow us on

మాయలు , మోసాలు పెరిగిపోతున్నాయి. కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. అందుగలదు, ఇందు లేదు అన్నట్లుగా ఇప్పుడు ప్రతి దాంట్లో మోసం కామనైపోయింది. తాజాగా  గుంటూరు జిల్లా తెనాలి కేంద్రంగా కోఆపరేటివ్‌ సొసైటీ పేరుతో బ్యాంక్‌లో ఉద్యోగాల పేరిట రూ.లక్షల్లో కాజేశారు. డబ్బు తీసుకుని తమను మోసగించారంటూ బాధితులు సోమవారం గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్‌గున్నీకి కంప్లైంట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్పందించిన ఆయన వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

బాధితులు తెలిపిన వివరాల మేరకు తెనాలి చెంచుపేటలో ఒక కోఆపరేటివ్‌ సొసైటీ పేరిట బ్యాంక్‌ పెట్టామని..దానికి సంబంధించిన బ్రాంచుల్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ ఆంధ్రా, తెలంగాణలో ఉద్యోగాలు ఉన్నాయంటూ ఛైర్మన్‌, డైరెక్టర్లంటూ పది మంది సభ్యులు యువకులను మభ్యపెట్టారు. బ్యాంక్‌ మేనేజర్‌, అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టుల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అందినకాడికి దండుకున్నారని కొల్లూరుకు చెందిన చందు, లలితకుమార్‌, నగరం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, దావులూరుకు చెందిన కోటేశ్వరరావు, ప్రత్తిపాడుకు చెందిన ఖాజావలి తెలిపారు. 2018లో నగదు వసూలు చేసి అప్పాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారని చెప్పారు. కొంతమందికి ఒక నెల శాలరీ ఇచ్చి తాము చెప్పినప్పుడు ఉద్యోగానికి రావాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా బ్రాంచిలు నిర్మాణ దశలో ఉన్నాయని అవి కంప్లీట్ అవ్వగానే పోస్టింగ్‌లు ఇస్తామన్నారని తెలిపారు. రెండు రాష్ట్రాల్లో సుమారు 220 మందిని మోసగించి రూ.మూడు కోట్ల వరకు డబ్బు దండుకోని బోర్డు తిప్పేశారని వెల్లడించచారు. ఇటీవల తెనాలిలోని మెయిన్ ఆఫీస్ ఖాళీ చేశారని, వారికి ఫోన్‌ చేసినా, డబ్బులు అడిగినా చంపేస్తామని బెదిరిస్తున్నారని.. రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరారు.

Also Read :

ఏపీ :వారి అకౌంట్ల‌లో నేరుగా రూ.10వేలు జమ

ఏపీలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీపై స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు