తెరుచుకున్న బద్రీనాథ్‌

| Edited By:

May 10, 2019 | 2:02 PM

హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌‌ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. చార్‌ధామ్‌‌ యాత్రలో భాగంగా హిందువులు దర్శించుకునే ఉత్తరాఖండ్‌లోని నాల్గో పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్‌ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేదపండితుల ప్రత్యేక పూజల మధ్య ఇవాళ ప్రధాన ద్వారాలు తెరుచుకున్నాయి. బద్రీనాథుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా ప్రతికూల పరిస్థితుల మధ్య శీతాకాలంలో బద్రీనాథ్‌ ఆలయాన్ని మూసివేస్తారు. అనంతరం వేసవి ప్రారంభమైన తర్వాత  కొద్దిరోజులకు […]

తెరుచుకున్న బద్రీనాథ్‌
Follow us on

హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌‌ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. చార్‌ధామ్‌‌ యాత్రలో భాగంగా హిందువులు దర్శించుకునే ఉత్తరాఖండ్‌లోని నాల్గో పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్‌ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేదపండితుల ప్రత్యేక పూజల మధ్య ఇవాళ ప్రధాన ద్వారాలు తెరుచుకున్నాయి. బద్రీనాథుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా ప్రతికూల పరిస్థితుల మధ్య శీతాకాలంలో బద్రీనాథ్‌ ఆలయాన్ని మూసివేస్తారు. అనంతరం వేసవి ప్రారంభమైన తర్వాత  కొద్దిరోజులకు ఆలయ తలుపులను తెరుస్తారు.