Changes In TS Inter Exams: కరోనా కారణంగా ప్రభావితమైన రంగాల్లో విద్యా రంగం ఒకటి. తరగతులు జరగకపోవడంతో అన్ని విద్యా సంస్థలు ఆన్‌లైన్ క్లాస్‌ల బాట పట్టాయి. ఈ కారణంగా విద్యార్థులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇంటర్ పరీక్షల విధానంలో మార్పులు తీసుకురావాలని తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఆలోచిస్తోంది. ప్రభుత్వం ఆమోదిస్తే ఆ మేరకు మార్పులు చేసి పరీక్షలు నిర్వహించాలనుకుంటున్నారు.
ఇంతకీ ఇంటర్ బోర్డ్ చేయాలనుకుంటున్న మార్పులు ఏంటంటే.. ప్రశ్నా పత్రంలో ప్రశ్నల చాయిస్ పెంచడంతో పాటు, పరీక్ష సమయాన్ని కుదించాలని భావిస్తోంది. ముఖ్యంగా 2,4,8 మార్కుల ప్రశ్నల చాయిస్ పెంచాలని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇంతే కాకుండా ఉదయం ఎంపీసీ, ఆర్ట్స్ విద్యార్థులకు.. మధ్యాహ్నం బైపీసీ, కామర్స్ గ్రూపు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని బోర్డ్ యోచిస్తోంది. ఇక సంక్రాంతి అనంతరం కాలేజీలు ప్రారంభించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ మేరకు తాము రూపొందించిన ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వానికి పంపినట్టు తెలిసింది. ఇంటర్ బోర్డ్ అధికారులు పంపిన నివేదికలకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే పరీక్షల విధానంలో మార్పులు జరగడంతో పాటు సంక్రాంతి తర్వాత కాలేజీలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Also Read: Kakatiya University Exam: జనవరి 20 నుంచి కాకతీయ యూనివర్సిటీ దూర విద్య పీజీ పరీక్షలు.. టైమ్ టేబుల్