గుంటూరుజిల్లా బుర్రిపాలెంలో ఉదయాన్నే కలకలం, చందు కృష్ణమూర్తి అనే వ్యక్తి హత్య, గ్రామంలో అలజడి

|

Dec 20, 2020 | 9:01 AM

గుంటూరుజిల్లా బుర్రిపాలెం గ్రామంలో కలకలం రేగింది. చందు కృష్ణమూర్తి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. విషయం గ్రామంలో దావానలంలా వ్యాపించడంతో ఘటనా..

గుంటూరుజిల్లా బుర్రిపాలెంలో ఉదయాన్నే కలకలం, చందు కృష్ణమూర్తి అనే వ్యక్తి హత్య, గ్రామంలో అలజడి
Follow us on

గుంటూరుజిల్లా బుర్రిపాలెం గ్రామంలో కలకలం రేగింది. చందు కృష్ణమూర్తి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. విషయం గ్రామంలో దావానలంలా వ్యాపించడంతో ఘటనా స్థలానికి పెద్దసంఖ్యలో గ్రామస్తులు చేరుకున్నారు. పోలీసులు హత్యోదంతంపై ఆరా తీస్తున్నారు. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే కృష్ణమూర్తి హత్య జరిగిందని ఎస్ఐ మురళి టీవీ9కు వెల్లడించారు. పొలానికి బంధించి పదిహేనేళ్లుగా ఇరు కుటుంబాల మధ్య వివాదం నడుస్తుందని ఎస్ఐ తెలిపారు. మృతుడు కృష్ణమూర్తి అన్న కొడుకులే హత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.