5

Chandrayaan 2: ఆ చివరి నిమిషంలో అసలు విక్రమ్‌కి ఏమైంది..?

48 రోజులు అంతా సాఫీగానే సాగింది. ఇక చందమామపై మరో 15 నిమిషాల్లో విక్రమ్ అడుగుపెట్టబోతుందనుకున్న సమయంలో అంతా ఉత్కంఠనెలకొంది. ఇస్రో ముందుగానే తెలిపింది.. చివరి పదిహేను నిమిషాలు ఎంతో కీలకమని. అయితే ఇస్రో సైంటిస్టులు అయితే ఇస్రో శాస్త్రవేత్తలు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ముందు అనుకున్నట్లుగానే జరిగిపోయింది. శాస్త్రవేత్తలు అనుకున్న కీలకమైన 15 నిమిషాల్లో 14 నిమిషాలు తీవ్ర ఉత్కంఠ మధ్య సజావుగానే గడిచిపోయాయి. ఇక […]

Chandrayaan 2: ఆ చివరి నిమిషంలో అసలు విక్రమ్‌కి ఏమైంది..?
Follow us

| Edited By:

Updated on: Sep 07, 2019 | 9:58 AM

48 రోజులు అంతా సాఫీగానే సాగింది. ఇక చందమామపై మరో 15 నిమిషాల్లో విక్రమ్ అడుగుపెట్టబోతుందనుకున్న సమయంలో అంతా ఉత్కంఠనెలకొంది. ఇస్రో ముందుగానే తెలిపింది.. చివరి పదిహేను నిమిషాలు ఎంతో కీలకమని. అయితే ఇస్రో సైంటిస్టులు అయితే ఇస్రో శాస్త్రవేత్తలు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ముందు అనుకున్నట్లుగానే జరిగిపోయింది. శాస్త్రవేత్తలు అనుకున్న కీలకమైన 15 నిమిషాల్లో 14 నిమిషాలు తీవ్ర ఉత్కంఠ మధ్య సజావుగానే గడిచిపోయాయి. ఇక మరొక్క నిమిషం.. కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు.. ఇస్రోలో టెన్షన్ నెలకొంది.

అప్పటిదాకా వచ్చిన విక్రమ్ సిగ్నల్స్.. ఒక్కసారిగా నిలిచిపోయాయి. దీంతో సైంటిస్టుల‌ ముఖాల్లో.. అప్పటి వరకు సంతోషంలో ఉన్న వారి ముఖంలో.. చిరున‌వ్వులు దూరమయ్యాయి. అప్పటి దాకా.. 48 రోజులు సజవుగా సాగిన చంద్రయాన్2 ప్రయాణం.. చివరి నిమిషంలో సిగ్నల్స్‌లో అంతరాయం ఏర్పడింది. చంద్రుడి ఉపరితలానికి మరో 2.1 కిలోమీటర్లు ఎత్తులో ఉన్న సమయంలో ఈ ఊహించని సమస్య ఎదురైంది. మరి ఇంతకి.. విక్రమ్ క్రాష్ అయ్యిందా.. ? లేదంటే ల్యాండ్ అయిన తర్వాత.. సిగ్నల్స్ కట్ అయ్యాయా.. ? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

అయితే చంద్రుడి ఉపరితలం వైపు గంటకు 6000 కి.మీ స్పీడ్‌తో దూసుకెళ్లిన విక్రమ్‌ను.. ఆ స్పీడ్‌ను తగ్గించేందుకు ఇస్రో చాలా కష్టపడాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. విక్రమ్ ల్యాండర్ వేగానికి బ్రేకులు వేసేందుకు శాస్త్రవేత్తలు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ల్యాండర్ యొక్క నాలుగు మూలలతో పాటు.. మధ్య భాగంలో థ్రస్టర్స్‌ను ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు థ్రస్టర్స్‌ని వ్యతిరేక దిశలో ప్రయోగించి దాని వేగాన్ని తగ్గించారు. మొదట రఫ్ బ్రేకింగ్ కక్ష్యను సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేశాక.. ఫైన్ బ్రేకింగ్ ప్రారంభమైంది. అప్పుడు అనుకున్నట్లుగానే ల్యాండర్ వేగం తగ్గుతూ వచ్చింది. అయితే ఆఖరి నిమిషంలో విక్రమ్ నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయి. మరో నిమిషంలో చందమామపై అడుగుపెడుతుందనుకున్న సమయంలో ఈ అంతరాయం కలిగింది.

అయితే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అనేది అంత సాధారణమైన విషయమేమి కాదు. ఇప్పటిదాకా అనేక దేశాలు సాఫ్ట్ ల్యాండింగ్‌ కోసం ప్రయత్నించి విఫలమయ్యాయి. అమెరికా, రష్యా, చైనా చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయ్యాయి. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్ రేటు.. కేవలం 37శాతం మాత్రమే. ఆ విషయం తెలిసినప్పటికీ… ఇస్రో దీనిని ఛాలెంజ్‌గా తీసుకున్న ఇస్రో.. చంద్రయాన్2 ప్రయోగించింది. సరిగ్గా 48 రోజులు చందమామ వైపు ప్రయాణించి.. మరో నిమిషంలో దిగబోతుండగా.. అంతరాయం ఏర్పడింది. అయితే ఇంతకు విక్రమ్ ల్యాండర్ ఏమైంది. అసలు మరో నిమిషంలో దిగాల్సిన ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్ అవ్వడంతో ఏమై ఉంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా, విక్రమ్ వేగం అదపు తప్పి క్రాష్ అయిందా.. ? లేక ల్యాండ్ అయ్యాక సిగ్నల్ వ్యవస్థ నిలిచిపోయిందా..? అన్నది తెలియాల్సి ఉంది.

ఇస్రో చైర్మన్ ఏం అన్నారంటే..

విక్రమ్ ల్యాండ‌ర్ దాదాపు పూర్తి చేసుకునే స‌మ‌యంలో విఘాతం ఎదురైందని.. చంద్రుడి ఉప‌రిత‌లానికి 2.1 కిలోమీట‌ర్ల ఆల్టిట్యూడ్ వ‌ర‌కు విక్ర‌మ్ స‌జావుగా ప‌నిచేసింద‌ని ఇస్రో చైర్మ‌న్ శివ‌న్ పేర్కొన్నారు. అయితే ఆ త‌ర్వాతే ల్యాండ‌ర్ నుంచి సిగ్న‌ల్ కట్ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం డేటాను ప‌రిశీలిస్తున్నామ‌ని.. డేటాను ప‌రిశీలించిన త‌ర్వాత.. మ‌రోసారి ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

చిక్కుల్లో బాలీవుడ్ చాక్లెట్‌ బాయ్‌.. రణ్‌బీర్‌కు ఈడీ సమన్లు
చిక్కుల్లో బాలీవుడ్ చాక్లెట్‌ బాయ్‌.. రణ్‌బీర్‌కు ఈడీ సమన్లు
కోహ్లీ, అనుష్కల రిక్వెస్ట్.. మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దంటూ
కోహ్లీ, అనుష్కల రిక్వెస్ట్.. మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దంటూ
ఢిల్లీ నుంచి విజయవాడకు నారా లోకేష్.. రేపు చంద్రబాబుతో భేటీ..
ఢిల్లీ నుంచి విజయవాడకు నారా లోకేష్.. రేపు చంద్రబాబుతో భేటీ..
సినిమా ఫ్లాప్‌ అయ్యిందాగా, ఇంకెందుకు బతికున్నావ్‌ అన్నారు..
సినిమా ఫ్లాప్‌ అయ్యిందాగా, ఇంకెందుకు బతికున్నావ్‌ అన్నారు..
ఆదర్శ్ రాడు అంటూ మురారీకి అబద్దం చెప్పించిన ముకుంద..
ఆదర్శ్ రాడు అంటూ మురారీకి అబద్దం చెప్పించిన ముకుంద..
ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్ సేల్'.. అమితాబ్‌పై ఆగ్రహం
ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్ సేల్'.. అమితాబ్‌పై ఆగ్రహం
ICC World Cup: వన్డే ప్రపంచకప్ రికార్డులపై ఓ లుక్కేద్దాం రండి..
ICC World Cup: వన్డే ప్రపంచకప్ రికార్డులపై ఓ లుక్కేద్దాం రండి..
'ఆ బర్రె పిల్ల రతికకు నేనేం అన్యాయం చేశాను' రైతు బిడ్డ ఎమోషనల్
'ఆ బర్రె పిల్ల రతికకు నేనేం అన్యాయం చేశాను' రైతు బిడ్డ ఎమోషనల్
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌.. ప్రధాని మోడీ, అమిత్‌షాలతో భేటీ
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌.. ప్రధాని మోడీ, అమిత్‌షాలతో భేటీ
బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా..? తాజా రేట్లు ఇవే..
బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా..? తాజా రేట్లు ఇవే..