బస్సు కోసం బాబు బెంగ.. వదిలేయండి ప్లీజ్ అంటున్న కళా..

| Edited By: Srinu

Dec 07, 2019 | 6:30 PM

ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఇటీవల అమరావతి రాజధాని పర్యటనకు ఉపయోగించిన బస్సు (ఏపీ16 టిబి 0555 ) కోసం టిడిపి పోరాటం ప్రారంభించింది. దర్యాప్తు పేరుతో పోలీసులు బస్సును సీజ్ చేసి యాజమాన్యానికి ఇబ్బంది పెడుతున్నారని టిడిపి నేతలు ఆరోపణలు మొదలుపెట్టారు. ప్రతిపక్షనేత చంద్రబాబుపై దాడి చేసిన వారిని వదిలేసిన పోలీసులు.. దర్యాప్తు పేరుతో బస్సును సీజ్ చేయటం ఏంటని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. 9 రోజుల క్రితం చంద్రబాబు అమరావతి యాత్రకు బస్సులో బయలు దేరిన […]

బస్సు కోసం బాబు బెంగ.. వదిలేయండి ప్లీజ్ అంటున్న కళా..
Follow us on

ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఇటీవల అమరావతి రాజధాని పర్యటనకు ఉపయోగించిన బస్సు (ఏపీ16 టిబి 0555 ) కోసం టిడిపి పోరాటం ప్రారంభించింది. దర్యాప్తు పేరుతో పోలీసులు బస్సును సీజ్ చేసి యాజమాన్యానికి ఇబ్బంది పెడుతున్నారని టిడిపి నేతలు ఆరోపణలు మొదలుపెట్టారు. ప్రతిపక్షనేత చంద్రబాబుపై దాడి చేసిన వారిని వదిలేసిన పోలీసులు.. దర్యాప్తు పేరుతో బస్సును సీజ్ చేయటం ఏంటని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.

9 రోజుల క్రితం చంద్రబాబు అమరావతి యాత్రకు బస్సులో బయలు దేరిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు బస్సు యాత్ర ప్రారంభం కాగానే కొందరు రైతులు ఆయన ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్ళు, చెప్పులు రువ్విన ఉదంతం పతాక శీర్షికలకెక్కింది. అయితే రాళ్ళు రువ్విన వారిని వదిలేసిన పోలీసులు గత 9 రోజులుగా బస్సును తమ ఆధీనంలోనే ఉంచుకుని యాజమాన్యాన్ని ఇబ్బంది పెడుతున్నారని టిడిపి నేతలు అంటున్నారు. ఈ మేరకు టిడిపి ఏపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావు ప్రభుత్వానికి, రాష్ట్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాశారు.

బస్సును వెంటనే విడుదల చేయాలని, పోలీసులు చట్టం ప్రకారం పనిచేయాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని కళా ఆరోపిస్తున్నారు. రాజధాని పర్యటనలో చంద్రబాబు నాయుడుపై దాడి చేయించిదెవరో ప్రభుత్వం బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.