చంద్రబాబుకు బిజెపి భయం..ఇంతకీ ఆ పత్రిక ఏమంటోందంటే?

చంద్రబాబుకు బిజెపి భయం..ఇంతకీ ఆ పత్రిక ఏమంటోందంటే?

టిడిపి చీఫ్ చంద్రబాబుకు బిజెపి అంటే భయం పట్టుకుందా? అందుకే ఆర్నెల్ల క్రితం బిజెపి మీద రెచ్చిపోయిన చంద్రబాబు ఇపుడు ఎన్ని రాజకీయ పరిణామాలు జరిగినా నోరు మెదపడం లేదా? పైగా కమలనాథులను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారా? ఓ ఆంగ్ల పత్రిక మాత్రం అంతేనంటోంది. అనడం కాదు ఏకంగా ఓ పెద్ద కథనాన్నే రాసేసింది. ఇందుకు ఎన్నో ఉదాహరణలను తమ కథనాలను ప్రస్తావించింది. ఈ కథనమిపుడు సోషల్ వెబ్‌సైట్లలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల కాలంలో చంద్రబాబు మాట […]

Rajesh Sharma

| Edited By: Pardhasaradhi Peri

Dec 02, 2019 | 4:42 PM

టిడిపి చీఫ్ చంద్రబాబుకు బిజెపి అంటే భయం పట్టుకుందా? అందుకే ఆర్నెల్ల క్రితం బిజెపి మీద రెచ్చిపోయిన చంద్రబాబు ఇపుడు ఎన్ని రాజకీయ పరిణామాలు జరిగినా నోరు మెదపడం లేదా? పైగా కమలనాథులను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారా? ఓ ఆంగ్ల పత్రిక మాత్రం అంతేనంటోంది. అనడం కాదు ఏకంగా ఓ పెద్ద కథనాన్నే రాసేసింది. ఇందుకు ఎన్నో ఉదాహరణలను తమ కథనాలను ప్రస్తావించింది. ఈ కథనమిపుడు సోషల్ వెబ్‌సైట్లలో చక్కర్లు కొడుతోంది.

ఇటీవల కాలంలో చంద్రబాబు మాట తీరు మారింది. మొన్నటి ఎన్నికల ప్రచారంలో బిజెపిపైనా, కమలం పార్టీ నేతలపైనా నిప్పులు చెరిగిన చంద్రబాబు ఇప్పుడు బిజెపి నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ట్రై చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో మమతాబెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలతో భేటీ అయ్యి, బిజెపి అవకాశాలకు గండి కొట్టాలనుకున్న చంద్రబాబు ఇప్పుడు బిజెపికి ఫ్రెండ్షిప్ సిగ్నల్స్ పంపుతున్నారు. ఇందుకోసం టిడిపి ఎంపీలు రాయబారులుగా మారారు…. ఇదంతా ఓ ఇంగ్లీషు పత్రిక కథనం.

ఈ కథనం చదివితే ఇదంతా నిజమే కదా అనిపించక మానదు. ఎందుకంటే ఇవన్నీ ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలే కాబట్టి. నవంబర్ 23న చంద్రబాబు బిజెపికి సానుకూలంగా కామెంట్లు చేశారు. ఆ తర్వాత అమరావతిని జాతీయ మ్యాప్‌లో గుర్తించినందుకు కృతఙ్ఞతలు చెప్పే సాకుతో టిడిపి ఎంపీలు పలువురు మోదీని, అమిత్‌షాను కలిశారు. ఈక్రమంలోనే చంద్రబాబు బిజెపి తమకు శాశ్వత శతృవు కాదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేశారు. ఇదంతా నేరుగా కనిపించిన సంకేతాలు, పరిణామాలు.

ఇవి కాకుండా దేశంలో జరిగిన పలు కీలక పరిణామాలపై కూడా చంద్రబాబుు నోరు మెదపలేదు. గతంలో ఏ చిన్న అవకాశం వచ్చినా మోదీని తెగ విమర్శించేసిన చంద్రబాబు దాదాపు నెల రోజుల పాటు మహారాష్ట్ర పొలిటికల్ డ్రామా కొనసాగినా నోరు మెదపలేదు. ఎవరి పక్షమూ తీసుకోలేదు. ఒక దశలో శివసేన.. చంద్రబాబును సంప్రదించేందుకు ట్రై చేసినా ఆయన బిజెపి ఆగ్రనేతలకు ఆగ్రహం తెప్పింస్తుందన్న కారణంతో స్పందించలేదని తెలుస్తోంది. మొత్తానికి బిజెపి నాయకత్వానికి కోపం తెప్పించే పనులేవీ చంద్రబాబు ఇటీవల చేయడం లేదట. మరి దానికి కారణమేంటని ఆ ఆంగ్ల పత్రిక పేర్కొందో తెలుసా?

చంద్రబాబుపై గతంలో నమోదైన కేసులిపుడిపుడే మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 13 ఏళ్ళ క్రితం నందమూరి లక్ష్మీ పార్వతి దాఖలు చేసిన అక్రమాస్తుల కేసు ఇటీవలే మళ్ళీ రీ ఓపెన్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో 2015లో నమోదైన ఓటుకు నోటు కేసు దర్యాప్తు కూడా ఇటీవల వేగవంతమైంది. దానికి తోడు మరిన్ని ఆరోపణలతో బాబుపై కేంద్రానికి పలువురు ఏపీ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ అన్నింటినీ జత చేసి, కేంద్రం ఏ సిబిఐ దర్యాప్తుకో, ఏ ఈడీ విచారణకో ఆదేశిస్తే తన పరిస్థితి ఏంటని చంద్రబాబు మధనపడుతున్నారని.. అందుకే బిజెపి నేతలకు దగ్గరయ్యే ఏ అవకాశాన్ని వదలడం లేదని ఆ కథనం సారాంశం. కథనంలో నిజముందో లేదా కానీ, కథనంలో పేర్కొన్న అంశాలు మాత్రం నిజమే కదా అంటున్నారు తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిశీలకులు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందేనంటున్నారు వారంతా.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu